రివ్యూ రాజా తీన్‌మార్ : మెహబూబా – అసలు డైరెక్టర్ పూరియేనా ?

Friday, May 11th, 2018, 03:29:15 PM IST

తెరపై కనిపించిన వారు : ఆకాష్ పూరి, మేహా శెట్టి
కెప్టెన్ ఆఫ్ ‘మెహబూబా’ : పూరి జగన్నాథ్

మూల కథ :

గత జన్మలో ప్రేమించుకుని పాకిస్థాన్, ఇండియాల మధ్యన యుద్ధం కారణంగా విడిపోయిన ఇద్దరు ప్రేమికులు (ఆకాష్ పూరి, నేహా శెట్టి)లు మళ్ళీ జన్మలో రోషన్, అఫ్రిన్ గా ఒకరు పాకిస్థాన్ లో, ఒకరు ఇండియాలో పుట్టి తమ ప్రేమను గుర్తించి ఎలా కలుసుకున్నారు అనేదే సినిమా కథ.

విజిల్ పోడు :
→ సినిమాకి ప్రధాన బలం స్టోరీ లైన్. గత జన్మలో విడిపోయినవారు ఈ జన్మలో ఎలా కలుసుకున్నారు అనే ప్లాట్ సినిమాపై ఆసక్తిని క్రియేట్ చేయడంలో సఫలమైంది.

→ ఇంటర్వెల్ సమయానికి హీరో తన ప్రేమను హిమాలయాల్లో కనుగొనే సన్నివేశం చాలా బాగుంది.

→ హీరో ఆకాష్ పూరి ఒక నటుడిగా మంచి మార్కులనే కొట్టేశాడు. ఎమోషనల్ సన్నివేశాల్లో అతని నటన, డైలాగ్ డిక్షన్ ఆకట్టుకున్నాయి.

ఢమ్మాల్ – డుమ్మీల్ :

→ ప్రేమ కథ పేరుతొ తెరకెక్కిన ఈ సినిమాలో హీరో హీరోయిన్ల నడుమ ప్రేమ ఉందని చెప్పడమే కానీ ఎక్కడా సరిగా చూపలేదు.
→ హీరో తన ప్రేమ కోసం పాకిస్థాన్ వెళ్లడం, అక్కడ పోరాడటం అనే ముఖ్యమైన అంశాలని ఏ కోశానా ఆకట్టుకునే విధంగా చూపలేదు దర్శకుడు.
→ సినిమా మొత్తం రెండు మూడు సీన్లు మినహా మిగతా అంతా బోర్ కొట్టించింది. అందుకు కారణం పూరి ట్రై చేసిన కొత్త స్టైలే అనాలి.

దేవుడా ఈ సిత్రాలు చూశారా..

→ సినిమా క్లైమాక్స్ సన్నివేశం సున్నితమైన ఇండియా, పాక్ సరిహదులో జరిగిన తీరు చూస్తే ముక్కున వేలేసుకోవాలనిపిస్తుంది.

సినిమా చూసిన స్నేహితుడికి, సినిమా చూడని స్నేహితుడికి మధ్యన సంభాషణ ఇలా ఉంది..

మిస్టర్ ఎ : ఈసారైనా పూరి హిట్ కొట్టాడా ?
మిస్టర్ బి : అంతలేదు.
మిస్టర్ ఎ : మరి సినిమా చూస్తే కొత్తవాళ్లు తీసినట్టే ఉంటుందన్నాడు !
మిస్టర్ బి : హా.. అనిపించింది. అసలు డైరెక్టర్ పూరియేనా అని.