అది లేకుండా పురుషులు 21 సెకన్లు కూడా ఉండలేరట !

Thursday, June 23rd, 2016, 01:04:29 AM IST


స్మార్ట్ ఫోన్ అనేది ఆధునిక జీవితం లో మానవుని శరీరభాగం అయిపోయింది. మరి అలాంటి ఫోన్ ను చూడకుండా మీరు ఎంతసేపు ఉండగలరు.. ? 5 నిమిషాలో.. 10 నిమిషాలో అనుకుంటున్నారా..అంతలేదు. కేవలం ఒక్క నిమిషం కూడా ఉండలేరని తాజా అధ్యయనం లో వెల్లడైంది.జర్మనీ లోని వుర్జ్ బర్గ్ యూనివర్సిటీ, ఇంగ్లాండ్ లోని నాటింగ్ హామ్ టెంట్ యూనివర్సిటీ ఈ విషయం మీద అధ్యయనాన్ని నిర్వహించాయి. మహిళలు, పురుషులపై వేరువేరుగా జరిపిన ఈ అధ్యయనం లో పురుషులు కేవలం 21 సెకన్లు కూడా స్మార్ట్ ఫోన్ లేకుండా అందలేరని వెల్లడైంది.ఈ విషయం లో మహిళలే కొంత నయం.వారు సామ్రాట్ ఫోన్ లేకుండా 57 సెకన్ల పాటు వేచి చూడగలరని తేలింది. అంటే కనీసం ఒక్క నిమిషం కూడా మహిళలు కానీ పురుషులు కానీ స్మార్ట్ ఫోన్ లేకుండా ఉండలేరన్న మాట.