మేదస్సులో ఐన్ స్టీన్ ను మించిన అక్కా చెల్లెళ్లు!

Saturday, August 4th, 2018, 12:06:47 PM IST

ప్రపంచం వ్యాప్తంగా మేధావుల లిస్టు తీస్తే 1 శాతం మాత్రమే ఉంది. ఐక్యూ పరీక్షలో 140 పాయింట్లు దాటితే వారిని అపరమేధావులుగా పేర్కొంటారు. అయితే అందులో 160 పాయింట్లతో ప్రపంచాన్ని ఆకర్షించిన శాస్త్రవేత్తలు ఐన్ స్టీన్, హాకింగ్ లు మాత్రమే ఉన్నారు. ఇక మెన్సా ఐక్యూ పరీక్షలో ఇటీవల భారత సంతతికి చెందిన బ్రిటన్ బాలికలు అద్భుతంగా వారి టాలెంట్ ను నిరూపించుకున్నారు. ఏకంగా ఖగోళ శాస్త్రవేత్తలను మించిన ఐక్యూ పవర్ ని డెవలప్ చేసుకొని ప్రపంచాన్ని ఆకర్షించారు.

బ్రిటన్ లోని హెర్ట్ ఫోర్డ్ షైర్ లో ఉంటున్న నిష్కా, నైసాల వయసు కేవల 11 ఏళ్లు మాత్రమే. అయితే ఇటీవల జరిపిన మెన్సా ఐక్యూ పరీక్షలో ఈ సూపర్ సిస్టర్స్ 162 పాయింట్లతో ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్తలు స్టీఫెన్ హాకింగ్, అల్బర్ట్ ఐన్ స్టీన్ లను అధిగమించారు. అతితక్కువ వయసులోనే ఈ సాధించిన సిస్టర్స్ గా గుర్తింపు పొందారు. ఇక వీడియో గేమ్ లకు స్నాప్ చాట్ లకు దూరంగా ఉండటమే తమ విజయానికి కారణమని లాయర్లు అవ్వాలనుకుంటున్నట్లు తమ కోరికని బాలికలు తెలుపగా ఇద్దరు నిమిషం వ్యవధిలో జన్మించారని వారి తండ్రి వరుణ్ వివరించారు.

  •  
  •  
  •  
  •  

Comments