మోదీ ప్ర‌భుత్వాన్ని భ‌య‌పెట్టిన‌ `మెర్స‌ల్‌` డైలాగ్స్ ఇవే..

Thursday, October 26th, 2017, 02:20:42 AM IST

ప్ర‌స్తుతం దేశ‌వ్యాప్తంగా `మెర్సల్` గురించిన ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. ఈ సినిమాలో రాజ‌కీయంగా ప్ర‌కంప‌నాలు పుట్టించే డైలాగులు ఓ రేంజులో పేల‌డంతో వివాదాలు రాజుకున్నాయి. ముఖ్యంగా కేంద్రంలోని మోదీ ప్ర‌భుత్వం ప్ర‌వేశ‌పెట్టిన జీఎస్టీ వ‌ల్ల ఎవ‌రికి ఎలాంటి న‌ష్టం జ‌రుగుతోందో ఎలివేట్ చేసే డైలాగులు స‌హా ప్ర‌భుత్వాసుప‌త్రుల డొల్ల‌త‌నంపైనా విసిరిన పంచ్‌లు ప్ర‌భుత్వానికి ఎక్క‌డో త‌గిలాయి. దీంతో నేరుగా భాజ‌పా నాయ‌కులు బ‌రిలోకి దిగి హీరో విజ‌య్..పై ఎటాక్ చేశారు. అయితే అంత‌గా క‌దిలించిన డైలాగులు ఈ సినిమాలో ఏం ఉన్నాయో ప‌రిశీలిస్తే.. ఇవిగో ఇవే ఆ పంచ్ డైలాగులు…

1.ఇండియాలోని గవర్నమెంట్ హాస్పిటల్స్ లో కనీసం ఆక్సిజన్ సిలెండర్స్ కూడా ఉండవు.. ప్రభుత్వాస్పత్రుల్లో ఆక్సిజన్ సిలండర్లు లేక‌పోవ‌డానికి కార‌ణం? ఆక్సిజన్ సప్ల‌య‌ర్లకు రెండేళ్లుగా డబ్బులు చెల్లించలేని పరిస్థితిని ఎందుకు ప్రభుత్వ ఆస్పత్రులు ఎదుర్కొంటున్నాయి?

2. సింగపూర్ ప్రజలు 7శాతం జీఎస్టీ కడుతున్నారు.. ఉచితంగా వైద్య సేవలు అందుకుంటున్నారు.. కాని భారత ప్రభుత్వం ప్రజలనుంచి 28శాతం జీఎస్టీ వసూలు చేస్తోంది. అయినా ఎందుకని ప్రజలందరికీ కనీసం ఉచిత వైద్యం అందించలేకపోతోంది?

3.మెడిసిన్‌ మీద 12శాతం జీఎస్టీ కడుతున్నాం..లిక్కర్ మీద మాత్రం జీఎస్టీ లేనేలేదు.. ఎందుకిలా?

4.ప్రభుత్వ హాస్పిటల్స్ లలో కిడ్నీ పేషెంట్లకు డయాలసిస్ చేస్తున్నప్పుడు పవర్ ఔటేజ్ సమస్య తలెత్తి నలుగురు రోగులు చనిపోయారు.. పవర్ సప్లై బ్యాకప్ లేక వీళ్లంతా చనిపోవడం ఎంతటి దౌర్భాగ్యం?

5.ఇంక్యుబేటర్ లో ఉంచిన బేబీ ఎలుకలు కొరికి చనిపోవడమా?.. ప్రజలకు గవర్నమెంట్ హాస్పిటల్స్ అంటేనే వణుకు పుట్టే పరిస్థితి వచ్చింది. ఆ భయమే ప్రైవేట్ హాస్పిటల్స్ పెట్టుబడి సర్.. ..ఈ హత్యలన్నిటినీ మనం న్యాయమే అందామా? వీటిని హత్యలు అనకూడదా?