మెట్రో మరింత వేగం.. హైటెక్ సిటీ – ఎల్బీనగర్ సిద్ధమవుతోంది!

Sunday, June 10th, 2018, 01:42:45 AM IST

హైదరాబాద్ నగరంలో మెట్రో మొదలయినప్పటి నుంచి కొంత మందికి ఈజీ ప్రయాణం దొరికింది. అయితే ట్రాఫిక్ లో మాత్రం పెద్దగా మార్పులేమీ కనిపించడం లేదు. మెట్రో వస్తే తగ్గుతుందని అనుకున్నప్పటికీ పెద్దగా తేడాలు కనిపించడం లేదు. ఇకపోతే ప్రస్తుతం అమిర్ పెట్ నుంచి నాగోల్ వరకు మెట్రో రైలు పరుగులు తీస్తోంది. రోజుకి దాదాపు నలభై వేలమంది ప్రయాణిస్తున్నట్లు మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి మీడియాకు తెలిపారు.

అదే విధంగా మరికొన్ని స్టేషన్లలో పనులు కూడా ఎండింగ్ కు వచ్చాయని చెప్పారు. అమీర్ పేట్ – ఎల్బీనగర్ వరకు ప్రస్తుతం ఎలక్ట్రిసిటీ టెస్ట్ రన్ జరుగుతోంది. జులై నాటికి టెస్ట్ డ్రైవ్ పూర్తి చేసి ఆగస్టు లో స్టార్ట్ చేస్తామని చెప్పారు. ఇక అమీర్ పేట్ – హైటెక్ సిటీ వరకు మెట్రో రైలు కూడా త్వరలోనే పరుగులు తీయనుంది. ఈ రూట్ కోసం చాలా మంది ఎదురుచూస్తున్నారు. ఇది అక్టోబర్ లో ప్రారంభించనున్నట్లు తెలియజేశారు. అలాగే మెట్రోను త్వరలో గూగుల్ కి అనుసంధానం చేయనున్నట్లు తెలుపుతూ.. నాగోల్ నుంచి ఎల్బీనగర్ మీదుగా ఫలక్ నుమా వరకు ప్రతి మెట్రో పిల్లర్స్ కు యూనిక్ నెంబరింగ్ ఉంటుంది.

కారిడార్ 1కు ‘ఏ’, కారిడార్ 2కు ‘బి’, కారిడార్ 3కి ‘సీ’ ఉంటాయని పేర్కొన్నారు. మరికొన్ని ఏరియాల్లో కూడా మెట్రో మార్గాన్ని వేస్తున్నట్లు ఎన్వీఎస్ రెడ్డి తెలియజేశారు. ప్రస్తుతం పాత బస్తీలో మెట్రో ఏర్పాటు కోసం చర్చలు జరుగుతున్నాయి. 2019 మార్చ్ లోగా జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ వరకు మెట్రో మార్గాన్ని ఏర్పాటు చేస్తామని ప్రతి ఏరియా స్టేషన్ నుంచి కలుపుకుంటూ ఎయిర్ పోర్ట్ కు ఒక మార్గాన్ని అనుసంధానం చేస్తామని కూడా మెట్రో రైల్ ఎండీ తెలియజేశారు.

  •  
  •  
  •  
  •  

Comments