హైద‌రాబాద్ మెట్రో రెండో మార్గం స్టార్ట్

Monday, September 24th, 2018, 10:44:35 PM IST

మెట్రో రైల్ న‌గ‌ర‌వాసుల క‌ల‌. ద‌శాబ్ధ కాలంగా హైద‌రాబాద్ న‌గ‌రంలో మెట్రో నిర్మాణం అంతూ ద‌రీ లేకుండా సాగుతూనే ఉంది. ఈ ప్రాజెక్టుకు వేల కోట్ల బ‌డ్జెట్లు వెచ్చించి అత్యంత ప్ర‌తిష్ఠాత్మ‌కంగా నిర్మిస్తున్నారు. హైద‌రాబాద్ న‌గ‌రంలోని కీల‌క కూడ‌ళ్ల‌ను క‌లుపుకుంటూ ఔట‌ర్ రింగ్ రోడ్, న‌గ‌ర శివార్ల వ‌ర‌కూ మెట్రోని విస్త‌రించారు. ఇప్ప‌టికే ఒక లైన్ ఇదివ‌ర‌కూ ప్రారంభ‌మైంది. న‌గ‌రంలో నిత్యం ల‌క్ష‌ల్లో జ‌నం ఈ మెట్రో రైల్‌ని ఆశ్ర‌యించి ప్ర‌యాణాలు సాగిస్తున్నారు. టిక్కెట్టు ధ‌ర అందుబాటులో ఉంది. క్షేమంగా ఎలాంటి ట్రాఫిక్ త‌ల‌నొప్పి లేకుండా టార్గెట్‌ని చేరుకునే వెసులుబాటు ఉండ‌డంతో మెట్రోని ఆశ్ర‌యించేందుకు జ‌నం ఆస‌క్తి చూపిస్తున్నారు.

ఇప్పుడు మ‌రో కీల‌క అంకం. నేటి సాయంత్రం మెట్రో రైల్ రెండో మార్గం ప్రారంభ‌మైంది. అమీర్‌పేట స్టేషన్ లో పచ్చ జెండా ఊపి గవర్నర్ నరసింహన్ ఈ ప్రాజెక్టును అత్యంత ప్ర‌తిష్ఠాత్మ‌కంగా ప్రారంభించారు. కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ, మున్సిపల్ మంత్రి కేటీఆర్ తో పాటు ఇతర నాయ‌కులు ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. ఈ రెండో లైన్ ప్రారంభంతో న‌గ‌రంలో మ‌రింతగా ట్రాఫిక్ స‌మ‌స్య త‌గ్గుతుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. ఇక మెట్రో రైల్ స్టేష‌న్ల‌కు అనువుగా బ‌స్ స్టేష‌న్ల‌ను మార్చ‌డంతో ట్రాఫిక్ తీవ్ర‌త‌ను ఇంకా ఇంకా త‌గ్గించే వీలుంద‌ని అధికారులు చెబుతున్నారు. ఇక మెట్రో పేరు చెప్పి ఆ ప‌రిస‌రాల్లో షాపుల ధ‌ర‌లు, రియ‌ల్ వెంచ‌ర్ల ధ‌ర‌లు స్కైని ట‌చ్ చేస్తున్న వైనం చూస్తున్న‌దే.