ఒక చోటే పరిమితం చెయ్యొద్దు

Wednesday, September 24th, 2014, 04:39:44 PM IST


మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ బుధవారం గుంటూరులో విలేకరుల సమావేశంలో ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెట్రో రైల్ ప్రాజెక్టు విజయవాడ నగరానికే పరిమితం చేయకూడదని, విజయవాడ, గుంటూరు నగరాలతో పాటు తెనాలి, మంగళగిరి పట్టణాలను కలుపుతూ మెట్రోను నిర్మిస్తే అప్పుడు మంచి రాజధాని ఏర్పడుతుందని సూచించారు.

నాదెండ్ల ఇంకా మాట్లాడుతూ రాష్ట్ర పునర్విభజన చట్టంలో 13వ షెడ్యుల్ 12వ ప్రతిపాదనగా వీజీటీఎం పరిధిలో మెట్రో ప్రాజెక్ట్ నిర్మించాలని ఉందన్న విషయాన్నీ గుర్తు చేశారు. అలాగే ఒక అధికారి వ్యాఖ్యలతో మెట్రోని కేవలం ఒక నగరానికే పరిమితం చెయ్యడం సబబు కాదని, పునర్విభజన అంశాలను పరిగణలోకి తీసుకుని ప్రభుత్వం ముందుకు వెళ్ళాలని నాదెండ్ల మనోహర్ విజ్ఞ్యప్తి చేశారు.