మెట్రో రైలు కు మెల్లగా తగ్గుతున్న ఆదరణ

Thursday, January 11th, 2018, 05:44:01 PM IST

హైదరాబాద్ మహానగర ప్రజలు ఎప్పుడెప్పుడా అన్ని ఎదురు చూసిన మెట్రో రైల్ కల 2017 నవంబరు లో నెరవేరింది. మెట్రో సేవలు ప్రారంభం అయితే ఆర్ టి సి, ఎం ఎం టి ఎస్ లకు ప్రయాణీకుల తాకిడి కొంత వరకు తగ్గుతుందని, అలాగే ట్రాఫిక్ బాధలు కూడా కొంత మేర తగ్గుతాయి అని అందరూ భావించారు. ఇంత వరకు బాగానే వున్నా, ఇక్కడే అసలు విషయం దాగి వుంది. మొదట దాదాపు 2 లక్షల మంది ప్రయాణించిన మెట్రో రైలు లో నేడు కేవలం 50 వేల మంది మాత్రమే ప్రయాణిస్తున్నారు. ఇందుకు ప్రధాన కారణం మెట్రో చార్జీలు అని తెలుస్తోంది.

ఎన్నో వ్యయ ప్రయాసలతో కొన్ని సంవత్సరాలపాటు వేల కోట్ల రూపాయల వ్యయం తో నిర్మితమైన మెట్రో రైలు సామాన్యుడికి అందుబాటులోలేని ధరలు విధించడం వల్లనే ఈ పరిస్థితికి వచ్చిందనేది ఒప్పుకుని తీరవలసిన విషయం. మెట్రో లో ప్రస్తుతం మినిమం ఛార్జ్ 10 రూపాయలు, మాక్సిమం చార్జీ 60 రూపాయలు గా వింధించారు. ఈ ధరలు బస్సు, మరియు ఎం ఎం టి ఎస్ చార్జీలతో పోలిస్తే చాలా ఎక్కువని, రోజూ స్కూళ్ళు, కాలేజీలు, కార్యాలయాలకు వెళ్లే సాధారణ ప్రజానీకానికి ఇది తలకు మించిన భారమని, ప్రభుత్వం చొరవ చూపి ధరలను కొంత మేర తగ్గిస్తే బాగుంటుందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.

  •  
  •  
  •  
  •  

Comments