అదిరిపోయే మోడల్ ని వదిలిన షియోమీ.. ఎంఐ 8!

Thursday, May 31st, 2018, 05:24:25 PM IST

మొబైల్ రంగంలో ప్రస్తుతం చైనా షియోమీ దూసుకుపోతోంది. ఇండియాలో కూడా ఈ కంపెనీ మొబైల్ లకు మంది ఆదరణ దక్కుతోంది. ఎన్ని కంపెనీలు పోటీకి వచ్చినప్పటికీ విడుదల చేసిన ప్రతి మోడల్ ను జనాలను ఆకర్షించేలా డిజైన్ చేస్తోంది. ఇక రీసెంట్ గా షియోమీ మరో కొత్త మొబైల్ ను రిలీజ్ చేసింది. సరికొత్త స్మార్ట్‌ఫోన్ ఎంఐ 8, ఎంఐ 8 ఎక్స్‌ప్లోరర్ ఎడిషన్‌ ను విడుదల చేయనున్నట్టు గత కొంత కాలంగా ఉరిస్తోన్న ఈ కంపెనీ ఎట్టకేలకు చైనా లో విడుదల చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ లో స్పెషల్ ఏంటంటే.. ఇన్‌ఫ్రారెడ్ అడ్వాంటేజ్ తో యూజర్ 3డీ ఫేస్ అన్‌లాక్ చేసుకోవచ్చు. అందరికి ఈ ఫెస్ లాక్ ఆప్షన్ నచ్చుతుందని కంపెనీ యాజమాన్యం తెలిపింది. మొదట ఈ మొబైల్స్ ను వచ్చే నెల 5న చైనాలో స్టార్ట్ చేసిన తరువాత మిగతా దేశాల్లో అందుబాటులోకి తేనున్నారు. బ్లాక్, బ్లూ, గోల్డ్, వైట్ కలర్ లలో ఎంఐ 8, ఎంఐ 8 ఎక్స్‌ప్లోరర్ ఎడిషన్‌ లు విడుదల కానున్నాయి.

ధరల విషయానికి వస్తే..

28,600 ధరల్లో 6 జీబీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజ్ గల స్మార్ట్ ఫోన్ అందుబాటులో ఉండగా.. రూ.31,600 ఖరీదు గల మొబైల్ లో 6 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్ సామర్థ్యం కలిగి ఉంది. ఇక రూ.34,800 గల మొబైల్ లో 6 జీబీ ర్యామ్‌, 256 జీబీ స్టోరేజ్ మరియు అద్భుతమైన ఫీచర్స్ ఉన్నాయి.

మరిన్ని ఫీచర్ల విషయానికి వస్తే..
6.21″ ఫుల్‌ స్క్రీన్‌ – 12 మెగాపిక్సెల్‌ డ్యూయల్‌ బ్యాక్ కెమెరా – 20 మెగాపిక్సెల్‌ ఫ్రంట్‌ కెమెరా – డ్యూయల్‌ ఫ్రీక్వెన్సీ జీపీఎస్‌, ఫేస్‌ అన్‌లాక్‌ – బ్యాక్ సైడ్ ఫింగర్‌ప్రింట్‌ సెన్సార్‌ – క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగన్‌ 845 ఎస్‌ఓసీ –
3400 ఎంఏహెచ్‌ బ్యాటరీ