వీడియో: ఊసరవెల్లి మొబైల్ రాబోతోంది!

Saturday, March 31st, 2018, 09:37:08 PM IST

కాలం పరిగెడుతోన్న కొద్దీ ఎన్నో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా మొబైల్ టెక్నాలిజీ లో ప్రతి ఒక్కరు లీనమై పోతున్నారు. కొత్త స్మార్ట్ ఫోన్ వచ్చిందంటే ఛాలు అందరి చూపు దాని వైపే వెళుతుంది. గత కొంత కాలంగా బడా కంపెనీలకు ధీటుగా పోటీని ఇస్తోన్న షియోమీ సరికొత్త మొబైల్ ని త్వరలో మార్కెట్ లోకి రిలీజ్ చేయనుంది. ఏ సంస్థ అయినా ఓ నాలుగైదు కలర్స్ లో మొబైల్ ను రిలీజ్ చేస్తుంది. ఏదైనా నచ్చిన కలర్ ని మనం కొనుగోలు చేస్తాం. కానీ షియోమీ చేస్తోన్న ప్రయత్నం ఇప్పుడు అందరిని ఆకట్టుకుంటోంది. ఎందుకంటే మన చేతిలో ఊసరవెల్లి లాంటి మొబైల్ ఉంటుంది. ఇష్టం ఉన్నట్లుగా కలర్ మార్చుకునే విధాంగా మొబైల్ ఫోన్ ని తాయారు చేయనున్నారట. సోషల్ మీడియా ద్వారా ఆ సంస్థ ఈ విషయాన్ని బయటపెట్టింది. దీంతో నెటిజన్స్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ మొబైల్ ఎప్పుడు వస్తుందని కామెంట్స్ చేస్తున్నారు. ఇక మరికొందరు ఇది ఏప్రిల్ ఫుల్ చేయడానికే అని స్పందించగా అలాంటిదేమి లేదని షియోమీ సంస్థ సమాధానం ఇచ్చింది.