నేటిఏపి స్పెషల్ : క్రికెట్ చరిత్రలో జరిగిన ఈ అద్బుతాల గురించి మీకు తెలుసా..?

Friday, February 26th, 2016, 04:53:13 PM IST


క్రికెట్.. ప్రపంచంలో పరిచయం అక్కరలేని పేరు. ఇక ఇండియాలోనైతే చెప్పక్కరలేదు. సెలవులు వస్తున్నాయి అంటే.. గల్లిగల్లిలో చిన్నపిల్లల దగ్గరి నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరు క్రికెట్ ఆడుతుంటారు. ఇక, ఇండియా పాక్ మ్యాచ్ వస్తుంది అంటే చాలు.. క్రికెట్ అభిమానులకు పండగే పండగా. సామాన్య ప్రజలు సైతం టీవీలకు అతుక్కుపోతారు. ఇకపోతే, ఇప్పుడు టి20 వచ్చాక క్రికెట్ లో మరింత మజా పెరిగింది. క్రికెట్ కార్పోరేట్ స్థాయి రావడంతో.. పేరుకు పేరుతో పాటు.. ఆదాయం ఫుల్లుగా లభిస్తున్నది. ఇటువంటి క్రికెట్ లో ఎన్నో అద్బుతాలు జరిగాయి. అందులో కొన్నింటి గురించి తెలుసుకుందామా.

10, క్రికెట్ లెజెండ్, క్రికెట్ దేవుడిగా గురింపు పొందిన సచిన్ టెండూల్కర్.. ఇండియా కంటే ముందు పాక్ తరపున బరిలోకి దిగాడు. 1987లో బ్రబౌర్నే స్టేడియంలో ఇండియా – పాక్ ల మధ్య ప్రాక్టీస్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో సచిన్ సబ్ ఫీల్డర్ గా పాక్ తరపున ఆడాడు.

9. క్రికెట్ చరిత్రలో పుట్టిన రోజున హ్యాట్రిక్ వికెట్లు తీసుకున్న ఒక్క బౌలర్ పీటర్ సిడ్డ్లె. ఈ ఆస్ట్రేలియా బౌలర్ 2010లో ఇంగ్లాండ్ పై ఈ ఫీట్ సాధించాడు.

8. ప్రపంచంలో వరసగా 153 టెస్ట్ మ్యాచ్ లు ఆడిన ఏకైక ఆటగాడు అలెన్ బోర్డర్.

7. విల్ఫ్రెడ్ రోడ్స్ అనే ఇంగ్లాడ్ ఆటగాడు 52 సంవత్సరాల వయసులో కూడా టెస్ట్ క్రికెట్ ఆడాడు.

6. 60 ఓవర్లు, 50 ఓవర్లు, 20 ఓవర్ల వరల్డ్ కప్ లను సాధించిన ఏకైక దేశం ఇండియా. 1983 వరల్డ్ కప్ (60 ఓవర్ల మ్యాచ్), 2007 టి20 వరల్డ్ కప్, 2011 వరల్డ్ కప్ ఇలా మూడు సాధించిన ఏకైక దేశం ఇండియా కావడం విశేషం.

5. టెస్ట్ క్రికెట్ చరిత్రలో డాన్ బ్రాడ్మెన్ వికెట్ పడగొట్టిన ఏకైక బౌలర్ లాలా అమర్నాద్.
4. ఇండియా తరపున.. అటు ఇంగ్లాడ్ తరపున టెస్ట్ క్రికెట్ ఆడిన ఏకైన ఆటగాడు ఇఫ్తిఖార్ అలీ ఖాన్ పటౌడి మాత్రమే.
3. టెస్టులలో ఐదు రోజులపాటు బ్యాటింగ్ చేసిన ఇండియా ఆటగాళ్ళు ఇద్దరే ఇద్దరు. ఒకరు ఎంఎల్ జయసింహా, రెండో వ్యక్తి రవిశాస్త్రి.

2. టెస్ట్ మ్యాచ్ లో ఫస్ట్ బాల్ ను సిక్సర్ గా మలిచిన ఏకైక ఆటగాడు క్రిస్ గేల్ మాత్రమే.
1. సచిన్ టెండూల్కర్ ఆడిన బ్యాట్ తోనే పాక్ క్రికెటర్ షాహిద్ అఫ్రిది 36 బంతులలో సెంచరీ కొట్టి చరిత్ర సృష్టించాడు.