2019 బిగ్ ఫైట్.. మంత్రి అఖిలప్రియ‌ భ‌విష్య‌త్తు..త‌ప్ప‌కుండా చ‌ద‌వాల్సిన మ్యాట‌ర్..!

Tuesday, October 9th, 2018, 03:21:22 PM IST

ఏపీలో రాజ‌కీయ వాతావ‌ర‌ణం వేడెక్కింది. సార్వ‌త్రిక ఎన్నిక‌లు ద‌గ్గ‌ర ప‌డ‌డంతో అధికార ప్ర‌తిప‌క్ష పార్టీలు త‌మ‌దైన ప్ర‌ణాళిక‌ల‌తో…వాడి వేడి విమ‌ర్శ‌తో ఏపీ రాజ‌కీయాల్ని హాట్ హాట్‌గ మార్చారు. ఇక మ‌రోవైపు రోజుకో స‌ర్వే రిజ‌ల్టు బ‌య‌ట‌కు వ‌చ్చి రాజ‌కీయ వ‌ర్గాల్లో కాక రేపుతోంది. అయితే ఇప్పుడు అస‌లు మ్యాట‌ర్ ఏంటంటే.. ఏపీ ప‌ర్యాట‌క శాఖ మంత్రి అయిన అఖిల ప్రియ రాజ‌కీయ భ‌విష్య‌త్తుకు సంబందించి ఒక వార్త సోష‌ల్ మీడియాలోనే కాకుండా రాజ‌కీయ వ‌ర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

త‌ల్లి హాఠాన్మ‌ర‌ణంతో రాజ‌కీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన అఖిల ప్రియ.. ప్ర‌స్తుతం ప‌ర్యాట‌క మంత్రిగా కొన‌సాగుతున్నారు. అయితే పర్యాక మంత్రిగా అఖిల ప్రియ పూర్తిగా ఫెయిల్ అయ్యార‌ని.. క‌నీసం ఎమ్మెల్యేగా కూడా న్యాయం చేయ‌డంలేద‌ని ఆళ్ల‌గ‌డ్డ నియోజ‌క‌వ‌ర్గంలో టాక్ వినిపిస్తోంది. ఇటీవ‌ల ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు రాష్ట్రం మొత్తం స‌ర్వే చేయించ‌గా.. అఖిల ప్రియ‌కు సోసోగా మార్కులు ప‌డ్డాయ‌ని.. నియోజ‌క వ‌ర్గంలో ప్ర‌జ‌ల‌ను పూర్తిగా విస్మ‌రించారని.. అక్క‌డి ప్ర‌జ‌లు స‌మ‌స్య‌లు చెప్పుకునేందుకు కూడా ఈ మంత్రిగారు అందుబాటులో ఉండ‌డంలేద‌ని స‌మాచారం.

దీంతో ఇప్ప‌టికే అఖిల ప్రియ పై ప్ర‌జ‌ల్లో పూర్తి వ్య‌తిరేక‌త వ‌చ్చింద‌ని.. అంతే కాకుండా ఇటీవ‌ల పెళ్లి చేసుకున్న అఖిల‌ప్రియ.. త‌న బాధ్య‌త‌ల్ని పూర్తిగా విస్మ‌రించింద‌ని.. ఆళ్ల‌గ‌డ్డ‌లో ఇప్పుడు ఏ ప‌ని చెయాల‌న్నా.. అఖిల ప్రియ చెల్లెలు, మౌనిక చ‌క్రం తిప్పుతోంద‌ని తెలుస్తోంది. సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు స‌మ‌యం త‌క్కువ‌గా ఉండ‌డంతో ఇలాంటి నెగిటీవ్ ఇమేజ్‌తో వ‌చ్చే ఎన్నిక‌ల్లో అఖిల ప్రియ‌కు సీటు రావ‌డం క‌ష్ట‌మే అని టీడీపీ వ‌ర్గాల్లో చ‌ర్చించుకుంటున్నారు. మ‌రి చంద్ర‌బాబు రానున్న ఎన్నిక‌ల్లో మ‌రోసారి భూమా ఫ్యామిలీకి టికెట్ ఇచ్చే అవ‌కాశాలు చాలా త‌క్కువ‌గా ఉన్నాయ‌ని.. రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చించుకుంటున్నారు.