కాంగ్రెస్ రాష్టాన్ని అప్పుల పాలు చేశారు :మంత్రి హరీష్ రావు

Wednesday, May 16th, 2018, 10:34:25 AM IST

తెలంగాణా ప్రభుత్వం కష్టాల్లో ఉన్న రైతులను ఆదుకునేందుకు ఇటివల ప్రవేశపెట్టిన రైతుబందు పతకానుకి చాలా మంచి స్పందన లభిస్తున్నది. పొలం పండించుకోవడానికి ఏ రైతు డబ్బులకోసం జమిందారుల దగ్గరకు అప్పుకోసం వెళ్లి తిప్పలపాలు కాకూడదని సీఎం కేసిఆర్ మొదలు పెట్టిన ఈ పతాకంలో ప్రతీ రైతు ఏంటో కొంత నగదు పొందుతున్నారు. అయితే మంగళవారం రాష్ట్ర నీటి పారుదల శాఖా మంత్రి కోనేరు హరీష్ రావు మెదక్ జిల్లాలోని నర్సాపూర్, వెల్దుర్తి మండలం, ఉప్పులింగాపూర్, రామంతపూర్, చిన్న శంకరంపేట, నార్లాపూర్, కల్వకుంట గ్రామాల్లో రైతులకు చెక్కులు, పట్టాదారు పాస్ బుక్కులు పంచడానికి వెళ్ళారు.
అయితే ఈ చెక్కుల పంపిణీ కార్యక్రంలో మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం నడిచిన కాలంలో రైతులు అప్పుల పాలు అయ్యి ఉరి పోసుకున్నారు. 70 పాలన చేసినా వాళ్ళు ఇప్పటిదాకా చేసింది ఏమీ లేదని దేశానికి అన్నం పెట్టె రైతు దొక్క చీల్చి వారికి అన్యానం చేశారని అన్నారు. కానీ తెలంగాణా ప్రభుత్వం అలాంటిది కాదని సీఎం కేసీఆర్ రైతు బందవుడు అని హరీష్రావు అభివర్ణించారు. వచ్చే జూన్ మాసం 2నాటి నుండి రైతులకు మరింత సహాయాన్ని కలిపించడానికి 5 లక్షల ఉచిత భీమా సదుపాయాన్ని కూడా ఇస్తున్నామాని తెలిపాడు. తెలంగాణా ప్రభుత్వం పాలనలోకి వచ్చాక రైతులకు రూ. 17 వేల కోట్ల రుణాలను మాఫీ చేశారని, అంటే కాకుండా సుమారు 12 వేల కోట్లతో తెలంగాణా రాష్ట్రవ్యాప్తంగా 58 లక్షల మంది రైతులకు పంట పండించుకోవడానికి పెట్టుబడి కూడా సమకూరేలా చ్గూస్తునామని హరీష్ రావు వెల్లడించారు.

రూ. 10 వేల కోట్లు ఖర్చు చేసి పంట సాగు చేసుకోవడానికి కరెంటు తిప్పలు కూడా రాకుండా 24 ఎడతెరపి లేకుండా విద్యుత్తు అందజేస్తున్నామన్నారు. చివరకు పంట చేతికి వచ్చి ధాన్యం పోగుచేసాక పండించిన రైతుకు లాభం చేకూరేలా సరైన మద్దతు ధర ప్రకటించి ప్రభుత్వమెవ్ కొనుగోలు చేస్తుందని తెలిపారు. రైతుల వద్ద ధాన్యం కొనుగోలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం 300 కోట్లు ఇవ్వగా అది సరిపోదని దాని వాళ్ళ రైతులకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని కేసిఆర్ అదనంగా 1000 కోట్లు మంజూరు చేశారని తెలిపారు. కాగా ఈ కార్యక్రమానికి డిప్యుటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే మదన రెడ్డి, ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ రాజమణి, మురళీ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.