ప‌వ‌న్ నువ్వు ఆర‌డుగుల అంద‌గాడివా.. టీడీపీ మంత్రి జ‌వహ‌ర్ సంచ‌ల‌నం..!

Wednesday, October 24th, 2018, 10:35:11 AM IST

జ‌న‌సేన అధినేత పవన్ కళ్యాణ్ పై టీడీపీ మంత్రి జ‌వ‌హ‌ర్ చేసిన వ్యాఖ్య‌లు రాజ‌కీయ వ‌ర్గాల్లో హాట్ టాపిక్ అవుతున్నాయి. ఇటీవ‌ల ప‌వ‌న్ టీడీపీ పై విరుచుకుప‌డుతున్న సంగ‌తి తెలిసిందే. ముఖ్యంగా లోకేష్‌ను టార్గెట్ చేసిన ప‌వ‌న్.. వారస‌త్వ రాజ‌కీయాలకు త‌ను వ్య‌తిరేకం అని.. పంచాయితీ ప్రెసిడెంట్‌గా కూడా గెల‌వ‌ని లోకేష్ పంచాయితీ శాఖ‌కు మంత్రి అయ్యాడ‌ని.. ప‌వ‌న్ వ్యాఖ్య‌లు చేసిన సంగ‌తి తెలిసిందే.

అయితే ప‌వ‌న్ వ్యాఖ్య‌ల పై టీడీపీ శ్రేణులు మండి ప‌డుతున్నారు. సినిమాల్లో ప‌వ‌న్ వార‌స‌త్వం వ‌ల్లే వ‌చ్చాడ‌ని.. ప‌వ‌న్ ఏమ‌న్నా ప్ర‌భాస్‌లాగా ఆర‌డుగుల అంద‌గాడా.. లేక పై నుండి దిగి వ‌చ్చాడా.. చిరంజీవి వార‌సుడిగా సినీ రంగానికి వ‌చ్చిన ప‌వ‌న్ వ‌ల్ల ఎంద‌రో అమ్మాయిల జీవితాలు నాశ‌నం అయ్యాయ‌ని.. అలాంటి ప‌వ‌న్‌కు మంత్రి లోకేష్ విమ‌ర్శ‌లు చేసే అర్హ‌త లేద‌ని.. జ‌వ‌హ‌ర్ ఫైర్ అయ్యారు.

ఇక అంత‌టితో ఆగ‌ని మంత్రి జ‌వ‌హ‌ర్ ప‌వ‌న్ నువ్వేమంత అంద‌గాడివి కాద‌ని.. ఒక‌సారి అద్దంలో ముఖం చూసుకోమ‌ని.. అంద‌మంటే ప్ర‌భాస్‌ద‌ని.. అస‌లు చిరంజీవి లేక‌పోతే నువ్వు ఎక్క‌డ ఉండే వాడివో ఒక‌సారి ఆత్మ‌విమ‌ర్శ చేసుకోవాల‌ని.. గ‌ట్టుమీద ఉండి రాళ్ళు వేయడం చాలా తేలిక అని.. ప్ర‌స్తుతం ప‌వ‌న్ అలంటి ప‌నే చేస్తున్నాడ‌ని ప‌వ‌న్ పై ద్వ‌జ‌మెత్తాడు మంత్రి జ‌వ‌హ‌ర్. మ‌రి ఈ టీడీపీ నేత వ్యాఖ్య‌ల పై జ‌న‌సేన శ్రేణులు ఎలా స్పందిస్తారో చూడాలి.

  •  
  •  
  •  
  •  

Comments