రాజ‌కీయ వ‌ర్గాల్లో ప్ర‌కంప‌న‌లు.. ప‌వ‌న్ క‌ళ్యాణ్ అసలు గుట్టు ర‌ట్టు..?

Monday, November 19th, 2018, 01:07:30 PM IST

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఇటీవ‌ల తూర్పుగోదావ‌రి జిల్లాలో జ‌న‌సేన నిర్వ‌హించిన స‌భ‌ల్లో టీడీపీ, వైసీపీల పై విరుచుకుప‌డుతున్న సంగ‌తి తెలిసిందే. ముఖ్యంగా టీడీపీ అధినేత చంద్ర‌బాబు, మంత్రి నారా లోకేష్‌ల‌ను టార్గెట్ చేసుకుని ప‌వ‌న్ చేస్తున్న వ్యాఖ్య‌లు రాజ‌కీయ వ‌ర్గాల్లో హాట్ టాపిక్ అవుతున్నాయి. ఈ క్ర‌మంలో లోకేష్‌తో పాటు కొందరు టీడీపీ నేత‌లు కౌంట‌ర్లు ఇస్తున్నా.. ప్ర‌జ‌ల్లో మాత్రం ప‌వ‌న్ వ్యాఖ్య‌లే బ‌లంగా వెళుతున్నాయి. దీంతో లాభం లేద‌నున్నకున్న టీడీపీ శ్రేణులు డోసు పెంచి జ‌న‌సేనాని అస‌లు గుట్టు ర‌ట్టు చేస్తున్నారు.

తాజాగా ఏపీ మంత్రి క‌ళా వెంక‌ట‌రావు ప‌వ‌న్‌కు స‌వాల్ విసురుతూ.. బ‌హిరంగ లేఖ‌ను సంధించారు. 2014 ఎన్నిక‌ల్లో జగ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్ళి ప‌వ‌న్ 40 సీట్లు డిమాండ్ చేశాడ‌ని.. ఆయ‌న కాద‌న‌డంతో టీడీపీ పంచ‌న చేరార‌ని.. ఇక టీడీపీలో కూడా ప‌వ‌న్ ప‌ప్పులు ఉడ‌క‌క పోవ‌డంతో విడిపోయి.. త‌ప్పుడు విమ‌ర్శ‌లు చేస్తూ ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌త తీసుకొచ్చేందుకు ప్ర‌య‌త్నిస్తున్నార‌ని ఆయ‌న మండిప‌డ్డారు. ప్ర‌జారాజ్యం పార్టీ స్థాపించిన‌ప్పుడు సొంత అన్న‌య్య చిరంజీవిని గెలిపించ‌లేని ప‌వన్.. గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీని ఎలా గెలిపిస్తాడ‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. బీజేపీతో ప్యాకేజీ మాట్లాడుకున్న ప‌వ‌న్, మోదీని విమ‌ర్శించ‌క‌కుండా.. చంద్ర‌బాబును టార్గెట్ చేసి ఆయ‌న పై బుర‌ద జ‌ల్ల‌డానికి ప్ర‌య‌త్నిస్తున్నార‌ని.. గ‌త ఎన్నిక‌ల్లో పోటీ చేసేందుకు వైసీపీ అధ్యక్షుడు ద‌గ్గ‌ర‌కు వెళ్ళి 40 సీట్లు డిమాండ్ చేయ‌డం నిజం కాదా అంటూ ప‌వ‌న్‌ను ప్ర‌శ్నించారు క‌లా వెంక‌ట‌రావు. మ‌రి ఈ టీడీపీ మంత్రి వ్యాఖ్య‌ల పై ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎలా స్పందిస్తారో చూడాలి.