పూనమ్ కౌర్ పై మంత్రి కొల్లు రవీంద్ర స్పందన

Wednesday, January 10th, 2018, 01:24:55 PM IST

తెలుగు రాష్ట్రాల్లో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కి, సినిమా క్రిటిక్ కత్తి మహేష్ కి నడుస్తున్న యుద్ధం అందరికి తెలిసిందే. కత్తి మాటి మాటికీ ఏదో ఒక న్యూస్ ఛానల్ కి వెళ్లి డిబేట్ లు పెట్టి మరీ పవన్ పై తన అసహనాన్ని తెల్పుతూ వివాదాన్ని మరించ పెంచుతున్నారు. ఇది ఇలా ఉంచిది పవన్ కు అనుకూలంగా కత్తి పై పరోక్షంగా విమర్శలు చేసిన పూనమ్ కౌర్ కి కత్తి మహేష్ ఆరు ప్రశ్నలను అస్త్రం గా విసిరారు. పూనమ్ ని చేనేత బ్రాండ్ అంబాసిడర్ గా నియమించింది పవన్ రికమండేషన్ వల్లే అని ఆయన అన్నారు. అంతే కాక మరిన్ని ప్రశ్నలు సంధించారు.

దానికి పూనమ్, పవన్ గారు ఈ వివాదం నుండి మీరే నన్ను రక్షించాలి, దీని వల్ల నా ఫామిలీ మరియు కెరీర్ ఇబ్బందుల్లో పడుతుంది, వీలైతే మిమ్మల్ని ఒకసారి ఈ విషయమై పర్సనల్ గా కలవాలి అని ఆమె ట్వీట్ సారాంశం. అయితే కొత్తగా ఇవ్వాళ చేనేత శాఖా మంత్రి కొల్లు రవీంద్ర ఒక సంచలన విషయం చెప్పారు. అసలు ప్రభుత్వ పరంగా చేనేతకు సంబంధించి ఎవ్వరినీ బ్రాండ్ అంబాసిడర్ గా నియమించలేదని, కొంతమంది చేనేత సంఘం సభ్యులు పవన్ గారిని బ్రాండ్ అంబాసిడర్ గా ఉండమని కోరారని, అంతే తప్ప ఎవరిని ఇప్పటివరకు బ్రాండ్ అంబాసిడర్ గా నియమించలేదని ఆయన స్పష్టం చేశారు…

  •  
  •  
  •  
  •  

Comments