యాంగ్రీ కేటీఆర్.. డోంట్ ఆర్గ్యూ అంటూ ఆమ్రపాలిపై ఫైర్..!

Sunday, October 15th, 2017, 01:32:51 PM IST

తెలంగాణ మున్సిపల్ మరియు ఐటి శాఖామంత్రి కేటీఆర్ ఆగ్రహానికి గురయ్యారు. శనివారం వరంగల్ అర్బన్ కలక్టరేట్ లో జరిగిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. నిధుల విషయంలో స్థానిక ఎమ్మెల్యే, కలెక్టర్ ఆమ్రపాలిలపై కేటీఆర్ ఫైర్ అయ్యారు. అభివృద్ధి పనుల్లో వేగం చూపించే కేటీఆర్.. వరంగల్ నగరంలో పరిస్థితులు అలా కనిపించకపోవడంతో కలెక్టర్, మరియు ప్రజా ప్రతినిధులని ఘాటుగా మందలించారు. వరంగల్ నగర ప్రజలకోసం, అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి 300 కోట్లు కేటాయించారు. వాటి ప్రతిపాదనలు ఎక్కడ ? ఇంతటి నిర్లక్ష్యం వహిస్తే ఎలా ? ప్రజలకు ఏమని సంధానం చెబుతారు ? అంటూ ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేసారు.

ముఖ్యమంత్రి నిధులు కేటాయిస్తారు.. లక్ష్యాల్ని నిర్దేశిస్తారు. ఇంతకంటే ఏం చేయాలి.. వచ్చి అన్నం ముద్ద కలిపి నోట్లో పెట్టాలా ? అని నిలదీశారు. దీనితో సమావేశ మందిరం మొత్తం సైలెంట్ అయిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో తాను రివ్యూ ని కొనసాగించలేనని అంతా 24 న హైదరాబాద్ లో సమావేశానికి హాజరు కావాలని ఆదేశించారు. ఆమ్రపాలి కేటీఆర్ కు వివరణ ఇచ్చేందుకు ప్రయత్నించగా.. డోంట్ ఆర్గ్యూ ఆమ్రపాలి అంటూ ఫైర్ అయ్యారు. ఇక చేసేది ఏమీ లేక ఆమె సైలెంట్ అయిపోయారు. స్థానిక ఎమ్మెల్యే వినయ్ తీరుపై కూడా కేటీఆర్ అసహనం వ్యక్తం చేసారు.