పసిపాపకి కంటిచూపునిచ్చిన కేటీఆర్.. నెటిజన్ల ప్రశంసలు

Sunday, April 8th, 2018, 12:55:54 AM IST

కొన్నేళ్లుగా మంత్రి కేటీఆర్ సోషల్ మీడియా నెట్‌వర్క్ ట్విట్టర్ వేదికగానే ఎక్కడ సమస్యలు వచ్చినా నేనున్నాంటూ వాటిని పరిష్కరిస్తూ వస్తున్నారు. వ్యక్తిగతంగా ఆయన దగ్గరకు వచ్చి విన్నవించుకునే అవకాశం లేనివారు నేరుగా తమ సమస్యను ట్విట్టర్‌లో అభ్యర్థిస్తున్నారు. ముఖ్యంగా అనారోగ్యం కారణంగా ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ సర్జరీలకు డబ్బులు చెల్లించలేని వారికి క్షణాల్లో తన అధికారిక ఆఫీస్ నుంచి సేవలందిస్తున్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ నిధులను విడుదల చేసి ఆదుకుంటున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ర్టానికి చెందిన ఓ చిన్నారి కంటి చూపు స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతోంది. సాయం చేయాల‌ని ట్విట్టర్ లో చేసిన అభ్యర్థనను కూడా ఆయన క్షణాల వ్యవధిలో స్పందించి తన ఉదారతను చాటుకున్నారు. దీనిపై సోషల్ మీడియా వేదికగా కేటీఆర్‌పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. సాయం చేసే మ‌న‌సు ఉండ‌టం చాలా గొప్ప విష‌యం అంటూ కొనియాడుతున్నారు. స్థానికేతరులకు కూడా ఆయన ఆపన్నహస్తం అందించిన తీరుకు ఫిదా అయిన వారు కేటీఆర్‌ను అభినందిస్తున్నారు.

ట్విట్టర్‌లో చేసిన అభ్యర్థన ఏంటంటే..

కేటీఆర్.. అన్నయ్య చిన్న పాపకు కంటి సమస్య ఉంది. ఎల్‌వీ ప్రసాద్ ఆసుపత్రిలో ఆపరేషన్ చేయాలి. మీరు ఒక లెటర్ ఇష్యూ చేస్తే ఉచితంగా చికిత్స చేస్తారు. సంబంధిత పాప కుటుంబం ఆంధ్రప్రదేశ్‌కు చెందింది. తెలంగాణలో ఆరోగ్యశ్రీ పనిచేయడంలేదు. దయచేసి సహాయం చేయండి అన్నయ్య.. అంటూ భరత్ అనే వ్యక్తి కేటీఆర్‌కు ట్వీట్ చేశాడు. దీనిపై వెంటనే స్పందించిన కేటీఆర్ పాప చాలా అందంగా ఉంది. నా కార్యాలయ అధికారులు ఎల్‌వీ ప్రసాద్ ఐ హాస్పిటల్ లేదా సరోజిని దేవి ఐ హాస్పిటల్‌ను సంప్రదించి సాయం చేస్తారని ట్వీట్ చేశారు . ఎలాంటి ప్రాంత పక్షపాతాలు చూపించకుండా కొన్ని క్షణాలలో స్పందించి పాపకి ఆపరేషన్ చేయించినందుకు గాను ఆ పాప కుటుంబ కుటుంభ సభ్యులు చాలా సంతోషంగా ఉన్నామంటూ, తమ జీవితాంతం కేటీఆర్ కి రుణపడి ఉంటామని అన్నారు.

  •  
  •  
  •  
  •  

Comments