నిర్ధాక్షిణ్యంగా కూల్చేస్తా..సిఎం కేసీఆర్ వార్నింగ్ ..!

Saturday, September 24th, 2016, 08:00:25 PM IST

kcr
హైదరాబాద్ లో కురుస్తున్న భారీ వర్షాల వల్ల డ్రైనేజి వ్యవస్థ దుస్థితి బయటపడిన సంగతి తెలిసిందే.డ్రైనేజీని పునరుద్ధించేందుకు కేసీఆర్ పూనుకున్నట్లు తెలుస్తోంది.అక్రమ కట్టడాలు కట్టే వారికి సీఎం హెచ్చరికలు జారీచేశారు.అక్రమ కట్టడాలు కడితే నిర్దాక్షిణ్యంగా కూల్చేస్తానని అన్నారు.మూసి ఉన్న నాళాల పై అక్రమ కట్టడాలు కట్టడం వల్లనే ఈ పరిస్థితి ఏర్పడిందని అన్నారు.

శక్తికి మించిన వర్షాలు వచ్చినపుడు చిన్న చిన్న ఇబ్బందులు సహజమని అన్నారు. ప్రతిపక్షాలకు చిత్తశుద్ధి ఉంటె అక్రమ కట్టడాలను కూల్చే సమయం లో ధర్నాలు చేయవద్దని అన్నారు.చాలా నాళాల మీద నిర్మించిన అక్రమ భవనాలను ఇప్పటికే గుర్తించామని అన్నారు.వర్షాలు తగ్గిన తరువాత రోడ్ల విస్తరణకు రూ 300 కోట్లు మంజూరు చేస్తామని అన్నారు.హైదరాబాద్ విశ్వనగరంగా మారడం రాత్రికి రాత్రే జరగదని అన్నారు.