ఇది ఫ్లై ఓవర్ కాదు..ఫ్లై రివర్..!

Friday, September 23rd, 2016, 01:05:31 PM IST

w1
ఈ సమయంలో హైదరాబాద్ ను ప్రపంచ సుందర నగరంగా మారుస్తామని ఏ రాజకీయనాయకుడైన అంటే అందరూ నవ్విపోతారు.సుదరంగా అవసరం లేదు..నాళాలు తెరుచు కోని, గుంతలు లేని రోడ్లను వేయండి చాలు అని అంటారు.ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాలకు హైదరాబాద్ పరిస్థితి ఇలాఉంది. ద్వి చక్ర వాహనదారులు ఈ సమయం లో ప్రయాణించడం చాలా కష్టం.రోడ్లన్నీ నదులను తలపిస్తున్నవేళ గుంతలు గతుకులు ఎక్కడఉన్నాయో అర్థం కానీ పరిస్థితి నెలకొంది.

పంజాగుట్టలోని ఫ్లై ఓవర్ ని చుస్తే ఫ్లై రివర్ అని అంటారు.ఫ్లై ఓవర్ పై భారీగా నీటితో నిండిపోయి ఉంది.హుస్సేన్ సాగర్ నిజంగానే సాగరంలా మారిపోయి ఉంది. లోతట్టు ప్రాంత ప్రజలని అప్రమత్తం చేశామని మున్సిపల్ శాఖామంత్రి కేటీఆర్ తెలిపారు. మంచి వర్షాకాలంలో ఆయనకు అగ్ని పరీక్షే ఎదురైంది.ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ కాళ్లరిగేలా వాననీటిలోనే ముంపుకు గురైన ప్రాంతాలని పరిశీలిస్తున్నారు. గత కొన్ని రోజులవరకు ఐటి కి సంబంధించి విదేశీపర్యటనలతో విమానాల్లో తిరిగిన కేటీఆర్.. ప్రస్తుతం పక్కా లోకల్ అంటూ హైదరాబాద్ లో భారీ వర్షాలకు సంబంధించి సహాయక చర్యలని సమీక్షిస్తున్నారు.ఈ మేరకు కేటీఆర్ మున్సిపల్ శాఖ అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. సహాయక చర్యలకు సంబంధించి ఆయన అధికారులతో చర్చించారు.

హైదరాబాద్ లో జలమయమైన ప్రాంతాలను చూడాలంటే క్రింది ఫోటోలు చూడండి..

ఫోటోల కోసం క్లిక్ చేయండి