జ‌గ‌న్ పై కోడిక‌త్తి దాడి.. బొత్సా మేన‌ల్లుడి హ‌స్తం ఉంది.. టీడీపీ మంత్రి సంచ‌ల‌నం..!

Tuesday, October 30th, 2018, 02:05:40 PM IST

ఏపీ ప్రతిపక్షం వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి పై హ‌త్యాయ‌త్నంలో భాగంగా జరిగిన దాడి వెనుక వైసీపీ నేత‌ల హ‌స్తం ఉందంటూ టీడీపీ నేత‌లు సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేస్తున్నారు. ఏపీ ముఖ్య‌మంత్రి టీడీపీ అధినేత చంద్ర‌బాబుతో స‌హా నేత‌లంతా వైసీపీ కుట్ర‌లో భాగంగానే జ‌గ‌న్ పై దాడి జ‌రిగింద‌ని ఆరోపిస్తున్నారు. ఈ క్ర‌మంలో తాజాగా టీడీపీ ఎమ్మెల్సీ బాబూ రాజేంద్రప్రసాద్ జ‌గ‌న్ పై దాడి వెనుక ష‌ర్మిల‌, విజ‌య‌మ్మ‌ల హ‌స్తం ఉందంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేయ‌గా.. ఇప్పుడు తాజాగా మంత్రి న‌క్కా ఆనంద బాబు చేసిన వ్యాఖ్య‌లు రాజ‌కీయ వ‌ర్గాల్లో హాట్ టాపిక్ అవుతున్నాయి.

ఇక అసలు మ్యాట‌ర్ లోకి వెళితే.. విశాఖప‌ట్నం ఎయిర్‌పోర్టులో జ‌గ‌న్ జ‌గ‌న్ పై జ‌రిగిన క‌త్తి దాడి వెనుక.. జ‌గ‌న్ పార్టీకే చెందిన బొత్స స‌త్య‌నారాయ‌ణ మేన‌ల్లుడి హ‌స్తం ఉంద‌ని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు మంత్రి న‌క్కా ఆనంద్‌బాబు. తాజాగా మీడియాతో మాట్లాడిన న‌క్కా ఆనంద్ బాబు విమానాశ్ర‌యంలోకి కోడి క‌త్తి ఎలా వ‌చ్చిందో అని అంద‌రూ ఆశ్చ‌ర్య‌పోతున్నార‌ని.. అయితే ఆ క‌త్తిని బొత్స స‌త్య నారాయ‌ణ మేన‌ల్లుడే విశాఖ ఎయిర్‌పోర్టులోకి తీసుకెళ్ళాడ‌ని.. అయితే ఆధారాలు దొరక్కుండా మాయం చేశార‌ని ఈ మంత్రి గారు ఆరోపించారు. అస‌లు విష‌యాలు బ‌య‌ట ప‌డుతాయ‌నే జ‌గ‌న్ పోలీసు విచార‌ణ‌కు సహ‌క‌రించ‌డం లేద‌ని.. ఆయ‌న‌కు ఏపీ వ్య‌వ‌స్థ‌ల పై న‌మ్మ‌కం లేక‌పోతే… రాష్ట్రంలో పోటీ చేసే అధికారం కూడా లేద‌ని నక్కా ఆనంద్ బాబు మండి ప‌డ్డారు. మ‌రి ఈ మంత్రి గారి వ్యాఖ్య‌ల పై వైసీపీ శ్రేణుల నుండి ఎలాంటి రియాక్ష‌న్ వ‌స్తుందో చూడాలి.

  •  
  •  
  •  
  •  

Comments