షాకింగ్ కామెంట్స్ : మార్చ్ 5న టీడీపీ ఎంపీల రాజీనామా!

Friday, February 16th, 2018, 03:55:11 AM IST

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసలు రాజకీయాలు ఇప్పుడే మొదలవుతున్నాయని ప్రస్తుతం చెలరేగుతోన్న వివాదాలను చుస్తే అర్ధమవుతోంది. ఎప్పుడైతే కేంద్రం 2018-19 ఏడాదికి గాను బడ్జెట్ ను ప్రవేశ పెట్టిందో అప్పటి నుంచే రాష్ట్రంలో ఊహించని విధంగా ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. బీజేపీ తో మిత్ర పక్షంగా ఉన్న తెలుగు దేశం పార్టీ ఏం సాధించింది అని రాష్ట్రానికి ఏం తెచ్చిందని ప్రతి పక్ష నాయకులు కామెంట్స్ చేస్తుండడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అయితే చంద్రబాబు వారి మాటలకూ కౌంటర్ వేసే ప్రయత్నాలు చేస్తున్నాడు. పార్టీ నేతలతో ఎప్పటికప్పుడు చర్చలు జరుపుతూ కేంద్రంపై ఒత్తిడి తెచ్చే విధంగా ప్రయత్నాలు చేస్తున్నాడు.

ఇక అసలు విషయానికి వస్తే.. ఏపీ అధికార పార్టీ నేతలు వైసిపి సవాళ్లకు ప్రతి సవాల్ ను విసురుతున్నారు. వైఎస్ జగన్ చంద్రబాబు కు రీసెంట్ గా ఛాలెంజ్ విసిరినా సంగతి తెలిసిందే. ప్రత్యేక హోదా కోసం మా ఎంపీలు రాజీనామాకు సిద్దమే మీరు సిద్ధమా అని ప్రశ్నించగా.. అందుకు కౌంటర్ గా టీడీపీ మంత్రి ఆదినారాయణ రెడ్డి సిద్దమే అనే విధంగా మాట్లాడారు. జగన్ పార్టీ నేతలకంటే ముందే తాము రాజీనామా చేస్తామని ఆయన తెలిపారు. మిత్రపక్షం అయినా ఇచ్చిన 19 హామీ అంశాలను నరవేర్చాల్సిందేనని చెబుతూ.. మార్చ్ 5 వరకు అలా చేయకుంటే అందరం రాజీనామా చేస్తామని నారాయణరెడ్డి మీడియాకు వివరించారు.