అంప‌శ‌య్య‌పై `మిషన్ భగీరథ, మిష‌న్ కాక‌తీయ‌`

Tuesday, November 29th, 2016, 03:45:06 AM IST

kcrr
పెద్ద నోటు దెబ్బ అన్ని విభాగాల‌పైనా ప‌డుతోంది. ముఖ్యంగా కేసీఆర్ ప్ర‌భుత్వంపై ఓ రేంజులో పంచ్ ప‌డింద‌న్న‌ది విశ్లేష‌కుల మాట‌. అంతా బావుంది. ఇక నీటి ప్రాజెక్టుల కోసం భారీగా నిధులు కేటాయిస్తే అనుకున్న ల‌క్ష్యాల్ని చేరుకోవ‌డం ఏమంత క‌ష్టం కాద‌నుకున్న కేసీఆర్‌కి మింగుడుప‌డ‌ని స్ట్రోక్ ఇచ్చారు దేశ ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ. ముఖ్యంగా ఇంటింటికి తాగునీరు, బంగారు తెలంగాణ‌కు సాగు నీరు అంటూ సీఎం కేసీఆర్ బోలెడంత ప్ర‌చారం చేశారు. “వ‌చ్చే ఎన్నికలలోపు ఇంటింటికి తాగు నీరు ఇవ్వకపోతే నేను ఓట్లు అడిగే ప్ర‌స‌క్తే లేదు“ అని సీఎం కుండ‌బ‌ద్ధ‌లు కొట్టారు. దాంతో ఈ విష‌యాన్ని తెలంగాణ ప్ర‌జ‌లు అంతే సీరియ‌స్‌గా తీస్కున్నారు. ఇక తాగునీటి క‌ట‌క‌ట‌నుంచి త‌మ‌ని ర‌క్షించిన‌ట్టే అని అంతా భావించారు. అయితే ఇప్పుడున్న స‌న్నివేశంలో మిష‌న్ భ‌గీర‌థ‌, మిష‌న్ కాక‌తీయ పూర్త‌వ్వ‌డం అంత వీజీ కాద‌ని ఆర్థిక నిపుణులు తేల్చేస్తున్నారు.

బ్యాంకు రుణం, కేంద్రం నుంచి రుణం తీసుకోవాల‌ని చూసినా అదేమీ అంత ఈజీ ప్రాసెస్ కాద‌ని తేలిపోయింది. పెద్ద నోట్ల ర‌ద్దుతో ప్ర‌భుత్వాదాయం గణ‌నీయంగా ప‌డిపోయింది. దీంతో ప్రాజెక్టుల‌కు నిధులు వ‌చ్చే ప‌రిస్థితే లేద‌ని చెబుతున్నారు. పెద్ద నోటు పంచ్ కేసీఆర్ ప్లాన్స్‌కి అవ‌రోధంగా మారింది. ఇక ఇచ్చిన హామీ నెర‌వేర‌న‌ట్టేన‌ని అంటున్నారు. అంటే ఆ ప్ర‌భావం వ‌చ్చే ఎన్నిక‌ల‌పై ప‌డినా ఆశ్చ‌ర్య‌పోన‌క్క‌ర్లేద‌ని విశ్లేషిస్తున్నారు. మొత్తానికి ఎంతో ఘ‌నంగా బృహ‌త్త‌ర ప్రాజెక్టులుగా ప్రారంభించిన మిష‌న్ భ‌గీర‌థ‌, మిష‌న్ కాక‌తీయ అంప‌శ‌య్య‌పై మూలుగుతున్న‌ట్టేన‌న్న వాద‌న వినిపిస్తోంది. మ‌రి ఈ క్రైసిస్‌ని సీఎం కేసీఆర్ ఎలా అధిగ‌మించి ప‌నుల్ని ప‌ట్టాలెక్కిస్తారో చూడాలి.