అబ్బో.. మిథాలికి మూడు సార్లు లవ్ ఫెయిల్యూర్ అట !

Saturday, September 30th, 2017, 11:50:04 AM IST

ఇటీవల సోషల్ మీడియాలో తన ట్రెండీ లుక్స్ తో వార్తల్లో నిలుస్తోన్న టీం ఇండియా మహిళాక్రికేట్ కెప్టెన్ మిథాలీ రాజ్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేసారు. కేవలం ప్రతిభ మాత్రమే ఉంటె అవకాశాలు వస్తాయని వాదనతో తాను ఏకీభవించానని మిథాలీ అన్నారు. క్రికెట్ తో పాటు అన్ని రంగాలలో రాజకీయాలు ఉన్నాయని ఆమె ఘాటు వ్యాఖ్యలు చేశారు. మహిళా క్రికెట్ లో కూడా రాజకీయాలు ఎక్కువగా జరుగుతాయని మిథాలీ అన్నారు.

టీం ఇండియా ఆటగాళ్లతో హీరోయిన్లు చట్టపట్టాలు వేసుకుని తిరుగుతారని కానీ తమని మాత్రం ఎవరూ పట్టించుకోరంటూ మిథాలీ వ్యాఖ్యానించారు. తాను మాత్రం ఎవరితోనూ తిరగలేదని మిథాని తెలిపింది. అలాంటి అనుభవాలు తనకు లేవని మిథాలీ తెలిపింది. కానీ తాను మూడు సార్లు ప్రేమలో విఫలమైనట్లు మాత్రం మిథాలీ రాజ్ ప్రకటించడం విశేషం.

  •  
  •  
  •  
  •  

Comments