కోహ్లీ కంటే ముందే బాదేసిన మిథాలీ.. న్యూ రికార్డ్!

Thursday, June 7th, 2018, 06:57:18 PM IST

భారత మహిళా క్రికెట్ జట్టు అనగానే అందరికి ఎక్కువగా వినిపించే పేరు మిథాలీ రాజ్. లేడి రన్ మెషిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న మిథాలీ గత కొన్నేళ్లుగా జట్టుకు సేవలు అందిస్తున్నారు. ఇకపోతే ఆమె రీసెంట్ గా మరొక నూతన రికార్డును తన ఖాతాలో వేసుకున్నారు. టీ20 ల్లో అత్యధిక పరుగులు సాధించిన క్రికెటర్ గా రికార్డుల్లోకి ఎక్కారు.. కేవలం మహిళల పరంగానే కాకుండా పురుషుల రికార్డులను తిరగరాస్తు మిథాలీ టాప్ లో ఉండడం ప్రశంసించాల్సిన విషయం.

పరుగులు వీరుడు, ప్రస్తుత కెప్టెన్ విరాట్ కంటే ముందే మిథాలీ ఆ రికార్డును అందుకున్నారు.
కౌలాలంపూర్‌ లో ప్రస్తుతం మహిళల ఆసియా కప్‌ టోర్నీ జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే అందులో భాగంగా ఇటీవల జరిగిన శ్రీలంక భారత్ మ్యాచ్ లో మిథాలీ రాజ్ 23 బంతుల్లో 33 పరుగులు చేసి జట్టుకు విజయాన్ని అందించింది.; ఇక మొత్తంగా 2015ల పరుగులను చేసిన మొదట 2000 పరుగులు సాధించిన భారత క్రీడాకారిణిగా రికార్డు సృష్టించింది. కోహ్లీ ఇప్పటివరకు 1983 పరుగులు చేశాడు.

  •  
  •  
  •  
  •  

Comments