లక్ష్మీస్ ఎన్టీఆర్’ కి పోటీగా ‘జగన్ బయోపిక్’..షాకిచ్చిన టిడిపి..!

Friday, October 13th, 2017, 03:15:25 AM IST

వర్మ ఏ ముహూర్తాన లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రాన్ని ప్రకటించారో తెలియదు కానీ ఆ చిత్రం టిడిపి వర్సస్ వైసిపి మధ్య ఫైట్ గా మారిపోయింది. ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న నిర్మాత, లక్ష్మీపార్వతి ఇద్దరూ వైసిపికి చెందిన వారే కావడంతో వివాదం ఎక్కువవుతోంది. ఎన్టీఆర్, లక్ష్మి పార్వతి కలయిక మధ్య సున్నితమైన రాజకీయ అంశాలు ముడిపడిఉన్నాయి. వాటిని తమ అధినేత చంద్రబాబుకు వ్యతిరేకంగా వర్మ చూపిస్తారేమోననే ఆందోళనలో టిడిపి ఉంది. ఎవరు ఎన్ని చేసినా తాను వాస్తవాలనే చూపిస్తానని వర్మ చెబుతున్నారు.

ఈ చిత్రంపై టీడీపీ ఎమ్మెల్యే అనిత మాట్లాడుతూ జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ మహానుభావుడు. ఆయనపై వర్మ సినిమా తీయాలనుకుంటే పేదలకు చేసిన మంచిని వర్మ తన చిత్రం లో చూపించాలి. అయన కీర్తికి భంగం కలిగేలా చూపిస్తే టీడీపీ కార్యకర్తలు, ఎన్టీఆర్ అభిమానులు చూస్తూ ఊరుకోరని అనిత హెచ్చరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ని రాజకీయంగా ఎదుర్కొనలేకే జగన్ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం ద్వారా కుట్ర పన్నారని అనిత ఆరోపించారు. చనిపోయిన ఎన్టీఆర్ పై సినిమా తీయాలని వైసీపీ భావిస్తోంది. బ్రతికున్న జగన్ పై సినిమా తీసేవాళ్లు రెడీగా ఉన్నారు. జగన్ పై సినిమా తీస్తే పాదయాత్ర కూడా చేయలేరని అనిత ఘాటు వ్యాఖ్యలు చేశారు.

  •  
  •  
  •  
  •  

Comments