షాకిచ్చిన ఎమ్మెల్యే ..20 ఏళ్ల వరకు పాలు మాత్రమే తాగాడట..!

Tuesday, February 28th, 2017, 04:15:46 PM IST


తాను 20 ఏళ్ల పాటు కేవలం పాలు మాత్రమే తాగి బ్రతికానని టిడిపి ఎమ్మెల్యే చెప్పడంతో ఇంటర్వ్యూ చేస్తున్న యాంకర్ షాక్ కి గురయ్యారు. ” మీరు నమ్మినా.. నమ్మకపోయినా ఇది నిజం.. నేను 20 ఏళ్ల వరకు అన్నం కానీ ఇతర ఘన ఆహార పదార్థాలు కానీ తీసుకోలేదు.” అని ఆ ఎమ్మెల్యే చెప్పడంతో అవాక్కవడం యాంకర్ వంతైంది. పశ్చిమగోదావరి జిల్లా భీమవరం ఎమ్మెల్యే అయిన రామాంజనేయులు అలియాస్ అంజిబాబు ఈ వ్యాఖ్యలు చేశారు .తనకు 20 ఏళ్ళు వచ్చేవరకు అన్నం, చపాతీ, కూరలు వంటిని తినలేదని చెప్పాడు.అప్పటివరకు తాను పాలు మాత్రమే తాగేవాడినని రామాంజనేయులు అన్నారు. ఇతర ఆహార పదార్థాలు తినడానికి తనకు ఇష్టం ఉండేది కాదని ఆయన అన్నారు.

తనకు 20 ఏళ్ల వయస్సులో వివాహం జరిగిందని ఆతరువాత మాత్రమే అన్నం తినడం అలవాటు చేసుకున్నానని ఆయన అన్నారు. అదికూడా తన బంధువులు బలవంత పెడితే ఆ అలవాటు చేసుకున్నానని రామాంజనేయులు తెలిపారు. నేను అన్నం తినకపోవడంతో తనకు సరైన శరీర దారుఢ్యం రాదేమోనని మా బంధువులు భావించేవారు అని ఆయన అన్నారు. కేవలం పాలు మాత్రమే తాగడం వలన తాను ఎప్పుడూ అనారోగ్యానికి గురికాలేదని ఎమ్మెల్యే పేర్కొన్నారు. మనిషికి కావలసిన అన్ని పోషకాలు పాలలో ఉంటాయని ఆయన పేర్కొన్నారు. తాను ఇప్పుడు కూడా అన్నం తక్కువ మొత్తంలోనే తింటానని, ఎక్కువగా స్నాక్స్ , పాలు తీసుకుంటానని ఆయన అన్నారు.రామాంజనేయులు చెప్పిన విషయం నిజంగా ఆశ్చర్యకరమైనదని డాక్టర్లు అంటున్నారు. మనిషి పెరుగుదలకు, ముఖ్యంగా టీనేజ్ లో అన్నిరకాల పోషకాహారాలు అవసరం. అలాంటిది కేవలం పాలతో మాత్రమే మేనేజ్ చేయడం ఆశ్చర్యాన్ని కలిగించే విషయమని అంటున్నారు.