2019 ఎన్నిక‌ల్లో.. టీడీపీ – 130 నుండి 140 సీట్ల‌తో గెలుస్తుంద‌ట‌.. ప‌.గో.జీ ఎమ్మెల్యే జోస్యం..!

Tuesday, October 9th, 2018, 10:00:39 PM IST

ఏపీ రాజ‌కీయాలు రానున్న సార్వ‌త్రిక ఎన్నిక‌ల చుట్టే తిరుగుతున్నాయి. ఎన్నిక‌ల స‌మ‌యం ద‌గ్గ‌ర ప‌డ‌డంతో అధికార, ప్ర‌తిప‌క్షాలు త‌మ‌దైన ప్ర‌ణాళిక‌లు ర‌చించుకుంటూ ఎలాగైనా అధికారం సాధించాల‌ని ముందుకు సాగ‌తున్నారు. ఇక అస‌లు మ్యాట‌ర్ ఏంటంటే సార్వ‌త్రిక‌ ఎన్నిక‌ల హ‌డావుడి మొద‌లైన నేప‌ధ్యంలో ర‌క‌ర‌కాలు స‌ర్వేలు, నాయ‌కుల‌తో ఇంట‌ర్వ్యూలు తెర‌పైకి వ‌చ్చి రాజ‌కీయ వ‌ర్గాల్లో కాక‌రేపుతున్నాయి. అయితే అందులో భాగంగానే ఇప్పుడు తాజాగా ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాలోని ఉంగుటూరు ఎమ్మెల్యే వీరాజ‌నేయులు కూడా తాజాగా ఒక పొలిటిక‌ల్ వెబ్‌సైట్‌కి ఇంట‌ర్వ్యూ ఇచ్చారు.

ఇంట‌ర్వ్యూలో భాగంగా ఈ ఎమ్మెల్యే మాట్లాడుతూ… 2019 ఎన్నిక‌ల్లో ఏపీలో మ‌రోసారి టీడీపీనే అధికారంలోకి వస్తాద‌ని దాదాపు 130 నుండి 140 సీట్లు టీడీపీకి వ‌స్తాయ‌ని,, ఇటీవ‌ల వ‌చ్చిన స‌ర్వేలు కూడా టీడీపీకి అనుకూలంగా ఉన్నాయ‌ని.. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు అమ‌లు చేస్తున్న అనేక సంక్షేమ ప‌థ‌కాలు నేరుగా ప్ర‌జ‌ల‌కు చేరుతున్నాయని.. దీంతో దాదాపు ఎక్కువ శాతం మంది ప్ర‌జ‌లు టీడీపీ పాల‌న పై సంతృప్తిగా ఉన్నార‌ని.. అందుక‌నే ఈసారి ఎలాంటి కూట‌మి లేకుండానే ఒంట‌రిగా బ‌రిలోకి దిగి విజ‌యం సాధిస్తామ‌ని ఎమ్మెల్యే వీరాంజ‌నేయులు అన్నారు. ఇక‌పోతే ఈ ఎమ్మెల్యే గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీ త‌రుపున పోటీలోకి దిగి సుమారు ఎనిమివేల ఓట్ల తేడాతో ప్ర‌త్య‌ర్ధి పై ఘ‌న‌విజ‌యం సాదించారు.