బాబు లాగ ఎక్కడ హరీష్ రావు సీఎం అవుతారో అని కేసీఆర్ భయం…!!

Monday, November 7th, 2016, 03:02:24 PM IST

jeevan-reddy
వాస్తుని కారణంగా చూపెడుతూ దురుద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం సచివాలయ కూల్చివేతకు పూనుకొన్నదని తెలంగాణ కాంగ్రెస్ నేతలు గవర్నర్ సరసింహన్ ను కలిచి కేసీఆర్ నిర్మించ తలపెట్టిన కొత్త సచివాలయ నిర్మాణం పై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ గవర్నర్ కు వ్న్వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంలో కాంగ్రెస్ సీనియర్ నేత, జగిత్యాల్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మీడియా తో మాట్లాడుతూ.. ఆ సచివాలయంలో పాలన కొనసాగితే సీఎం కుమారులు మళ్లీ సీఎం కు కావడం లేదనే కారణం తోనే కేసీఆర్ ప్రస్తుత తెలంగాణ సచివాలయాన్ని కులగొడుతున్నారని ధ్వజమెత్తారు. ఎన్టీఆర్ తర్వాత ఆయన కుమారుడు కాకుండా అల్లుడు సీఎం అయ్యాడని, ఇప్పుడు కేసీఆర్ కుమారుడు కేటీఆర్ కాకుండా ఆయన అల్లుడు హరీష్ రావు సీఎం అవుతారేమో అన్న భయంతోనే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారని మండిపడ్డారు