ఎమ్మెల్యే పుట్టా చంపాల‌ని చూశాడు!?

Monday, October 8th, 2018, 11:04:11 PM IST

మాజీ ఎమ్మెల్యే పుట్టా మధు నన్ను చంపడానికి ప్రయత్నిస్తున్నాడు మ‌హా ప్ర‌భో! నాకు రక్షణ కల్పించండి!! అంటూ ర‌మ‌ణారెడ్డి అనే బాధితుడు తెలంగాణ డీజీపీని క‌ల‌వ‌డం సంచ‌ల‌న‌మైంది. 2013 లో తేరాస‌ మీటింగ్ లో కేసీఆర్ ముందు ఆత్మహత్య చేసుకున్న గుండా నాగరాజు కేసులో సాక్షం చెప్పొద్దంటూ పుట్టా బెదిరిస్తున్నార‌ని అత‌డు ఫిర్యాదు చేయ‌డం క‌ల‌క‌లం రేపుతోంది. కేసు పూర్వాప‌రాలు ప‌రిశీలిస్తే..

2014 ఎన్నికలో మంథని ఎమ్మెల్యే టిక్కెట్ పుట్ట మధుకు ఇవ్వాలంటూ పురుగుల మంది తాగి ఆత్మహత్య చేసుకున్న గుండా నాగరాజును.. అలా ఆత్మహత్య చేసుకోవడానికి 50,000 ఇచ్చి ప్రేరేపించింది పుట్టానే అంటూ సాక్షాధారాల‌ను డీజీపీకి సమర్పించాడు. కాల్ డేటా తో సహా, చనిపోయిన నాగరాజు ఇచ్చిన స్టేట్మెంట్ కాపీల‌ను డీజీపీకి అత‌డు అంద‌జేయ‌డంతో ప్ర‌స్తుతం ఈ వివాదం ఏ మ‌లుపు తిరుగుతుందోన‌న్న ఆస‌క్తి నెల‌కొంది. నాగరాజు ఆత్మహత్య కేసులో అన్ని ఆధారాలు ఉన్నా పుట్ట మధును నిందితుడిగా చేర్చకుండా, కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా పోలీసులు పక్షపాతంగా వ్యవహరించారని బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీనిని బ‌ట్టి అధికారంలో ఉంటే .. అధికారంలో ఉన్న‌ది త‌న‌వాడే అయితే రాజ‌కీయ నాయ‌కులు ఎలాంటి రాక్ష‌స‌కృత్యానికి పాల్ప‌డ‌తారో, మ‌నిషి లైఫ్ ఎంత సినిమాటిగ్గా ఉంటుందో అర్థం చేసుకోవ‌చ్చంటూ ప‌లువురు దీనిపై స్పందిస్తుండ‌డం సంచ‌ల‌న‌మైంది.