రాస‌లీల టేప్ ఎఫెక్ట్‌! ఆయ‌న కాళ్లు ప‌ట్టేశాడా?

Friday, September 14th, 2018, 03:50:58 AM IST


ఉప‌ముఖ్య‌మంత్రి హోదాలో ఉన్న పెద్దాయ‌న్ని నా నియోజకవర్గంలో అడుగుపెట్టొద్దని హెచ్చ‌రించిన ఎమ్మెల్యే, నేడు త‌న‌కు సహకరించాలని కోరుతూ కాళ్లు ప‌ట్ట‌డం రాజ‌కీయాల్లో ప‌రాకాష్ట అనే చెప్పాలి. అందునా గ‌త రెండ్రోజులుగా `ఎమ్మెల్యే రాస‌లీల‌ల టేప్‌` హెడ్డింగుకు కార‌ణ‌మైన వ్య‌క్తి ద‌గ్గ‌ర‌కు వెళ్లి ఆయ‌న పాదాల‌కు అభివంద‌నం చేసి త‌న‌కు స‌హ‌క‌రించాల‌ని కోరారంటే ఇదే త‌ర‌హా రాజ‌కీయం? ఇదంతా తేరాస నాయ‌కులు క‌డియం- రాజ‌య్య‌ల పొలిటిక‌ల్ గేమ్ గురించే.

ఎమ్మెల్యే వద్దంటే రాజకీయ జన్మనిచ్చిన గడ్డపై ఉపముఖ్యమంత్రి హోదాలో అధికారికంగా పర్యటించని కడియం.. బ‌ద్ధ‌ వ్య‌తిరేకి అయిన రాజయ్య ప‌త‌నాన్ని కోరుకున్న‌ తన అనుచ‌ర‌వర్గాన్ని ఆయ‌న‌కు సాయం చేయండ‌ని కోర‌తారా? ఇదేమి రాజ‌కీయ వైచిత్రి? ఇలాంటి వింత‌లు ఈ క‌ళికాలంలోనే సాధ్యం. రాజ‌య్య‌ రాస‌లీల‌ల టేపుల పుణ్య‌మా అని జ‌నంలో ఇలాంటి ఎన్నో సందేహాలున్నాయి. అస‌లేం జ‌రుగుతోందో అర్థం కాని గంద‌ర‌గోళం నెల‌కొంది.

గ‌తంలో రాజయ్య తప్పు చేసాడని బర్తరఫ్ చేసి ఎంపీగా ఉన్న కడియంను రాజీనామా చేయించి ఉపముఖ్యమంత్రిని చేసారు. ఇప్పుడు రాజయ్య పరిస్థితి సరిగా లేదని ఎమ్మెల్సీగా ఉన్న కడియంను రాజీనామా చేయించి ఎమ్మెల్యేగా నిలబెడతారా? ఇదెక్క‌డి చోద్యం? అంటూ ప్ర‌శ్నిస్తున్నారంతా. ఈ కాళ్లు ప‌ట్ట‌డం చూశాక‌.. సహచర నాయకున్ని రాజకీయంగా కుంగదీసి క‌డియం ఇలా కాళ్లు మొక్కించుకున్నాడని విమర్శలొస్తున్నాయి. ఓవైపు నియోజకవర్గం ఈ త‌ర‌హా గ్రూపు రాజకీయాలతో అభివృద్ధికి ఆమడ దూర‌మైపోయింది. నాడు కడియంను త‌న‌ నియోజకవర్గానికి రావొద్దన్న రాజయ్య …..నేడు సహకరించమని కాళ్లమీద పడటంలోని అంతర్యం ఏమై ఉంటుంది? ఇలాంటి రాజకీయాలతో వీళ్లు ప్రజలకు ఏం సందేశం ఇస్తున్న‌ట్టు? ఇలా ఎన్నో సందేహాలు రాజుకున్నాయి. మొత్తానికి స్టేష‌న్ ఘ‌న్‌పూర్ రాజ‌కీయాల లొల్లి జ‌నాల్ని క‌న్ఫ్యూజ్‌ చేయ‌డం స‌ర్వ‌త్రా చ‌ర్చ‌కొచ్చింది.

  •  
  •  
  •  
  •  

Comments