ఎమ్మెల్యే రోజాపై కేసు నమోదు

Thursday, September 25th, 2014, 11:52:48 AM IST


నగరి జాతరలో కులం పెరుతో దూషించారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగరి ఎమ్మెల్యే రోజాపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి కేసును నమోదు చేశారు. ఎమ్మెల్యే రాజాతో పాటు మరో 13 మందిపై కూడా కేసును నమోదు చేశారు. టీడీపి కార్యకర్త రమేష్ ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదు చేసినట్టు తెలుస్తున్నది. రాజాతో పాటు.. నగరి మున్సిపల్ చైర్మన్.. కేజే శాంతిపై కూడా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

నగరి జాతర సమయంలో ఎమ్మెల్యే రోజాకు తెలుగుదేశం పార్టీ వర్గీయులకు మధ్య చిన్నపాటి ఘర్షణ జరిగిన విషయం తెలిసిందే.. ఆ సమయంలో ఎమ్మెల్యే రోజా చేతికి గాయం అయింది. దీంతో రోజాతో పాటు మరికొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్యకర్తలు దేవాలయం ముందు ధర్నా నిర్వహించిన విషయం విదితమే. ఈ ధర్నాసమయంలో రోజా కులం పేరుతొ దూషించిందని ఈ రోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్త రమేష్ పోలిస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు పోలీసుకు రోజాపై కేసు నమోదు చేశారు