ఏపీ ముఖ్య‌మంత్రి చంద్రబాబు పై.. సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన‌.. వైసీపీ ఎమ్మెల్యే రోజా

Saturday, October 20th, 2018, 11:32:38 AM IST

ఏపీ ముఖ్య‌మంత్రి టీడీపీ అధినేత చంద్ర‌బాబు పై వైసీపీ ఎమ్మెల్యే రోజా చేసిన వ్యాఖ్య‌లు రాజ‌కీయ వ‌ర్గాల్లో హాట్ టాపిక్ అయ్యాయి. తాజాగా రావాలి జ‌గ‌న్- కావాలి జ‌గ‌న్ కార్య‌క్ర‌మంలో బాగంగా త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్య‌టించిన రోజా చంద్ర‌బాబు పై విమ‌ర్శ‌లు కురిపించారు. ఆమె మాట్లాడుతూ చంద్ర‌బాబును న‌మ్మితే ప్ర‌జ‌లంద‌రిని న‌ట్టేట ముంచుతార‌ని.. న‌గరి నియోజ‌క వ‌ర్గానికి నిధులు విడుద‌ల చేయ‌కుండా టీడీపీ ప్ర‌భుత్వ కుట్ర‌ప‌న్నుతుంద‌ని ఆమె ఆరోపించారు.

ఇక చంద్ర‌బాబు అండ్ కో మొత్తం క‌లిసి రాష్ట్రాన్ని స‌ర్వ‌నాశ‌నం చేశార‌ని.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌ప్ప‌కుండా వైసీపీ అధికారంలోకి వ‌స్తుంద‌ని..దీంతో ప్ర‌జ‌ల క‌ష్టాలు అన్ని తీరిపోతాయ‌ని రోజా అన్నారు. త‌న అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పాద‌యాత్ర‌కు వ‌స్తున్న స్పంద‌న చూసి.. టీడీపీ నేత‌లంతా కుళ్ళుకుంటున్నార‌ని.. అందుకే జ‌గ‌న్ పై టీడీపీ నేత‌లు వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేస్తున్నార‌ని రోజా మండి ప‌డ్డారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీకి ఒక్క జిల్లాలో కూడా డిపాజిట్లు రావ‌ని.. తండ్రీ- కొడుకుల ఆట‌లు సాగ‌వు అని ఎమ్మెల్యే రోజా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. మ‌రి రోజా వ్యాఖ్య‌ల పై టీడీపీ శ్రేణులు ఎలా స్పందిస్తారో చూడాలి.

  •  
  •  
  •  
  •  

Comments