విశాఖ పాలిటిక్స్ : జ‌గ‌న్ దండ‌’యాత్ర’ స్టార్ట్.. వైసీపీలోకి ద‌మ్మున్న ఎమ్మెల్యే..?

Wednesday, February 13th, 2019, 03:07:47 AM IST

ఆంధ్ర‌ప్రదేశ్‌లో సార్వ‌త్రిక ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌ప‌డుతున్నాయి. ఈ నేప‌ధ్యంలో ప్ర‌ధాన పార్టీల‌తో పాటు అన్ని పార్టీలు గెలుపు కోసం వ్యూహ‌ర‌చ‌న‌లు చేస్తున్నాయి. ముఖ్యంగా మేజ‌ర్ స్థానాల్లో అధికార టీడీపీకి, ప్ర‌తిప‌క్ష వైసీపీకి మ‌ధ్య‌నే ప్ర‌ధాన పోటీ ఉంటుంద‌న‌డంలో ఎలాంటి సంధేహం లేదు. ఈ క్ర‌మంలో ఈ రెండు పార్టీలు ఇప్ప‌టికే త‌మ‌దైన వ్యూహాలు మొద‌లుపెట్టి ముందుకుసాగుతున్నాయి.

ఇక ముఖ్యంగా వైసీపీ విష‌యానికి వ‌స్తే ఇప్ప‌టికే రాష్ట్రంలో ఆ పార్టీ బ‌లంగా పుంజుకుంది. గ‌త ఎన్నిక‌ల్లో తృటిలో అధికారాన్ని మిస్ చేసుకున్న వైసీపీ ఇప్ప‌డు ప్ర‌తి చిన్న విష‌యం పై కూడా జాగ్ర‌త్త‌గా అడుగులు వేస్తుంది. అందులో భాగంగానే పాద‌యాత్ర కంప్లీట్ చేసిన వైసీపీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి, మ‌ళ్ళీ బ‌స్సుయాత్ర‌కి రెడీ అవుతున్నారు.

ఈ గ్యాప్‌లో త‌ట‌స్తుల‌తో చ‌ర్చించేందుకు వారి స‌ల‌హాలు తీసుకునేందుకు అన్నిపిలుపు కార్య‌క్రామాన్ని స్టార్ట్ చేసిన వైసీపీ, మ‌రోవైపు బూత్‌లెవ‌ల్ కార్య‌క‌ర్త‌లు క్షేత్ర‌స్థాయిలో ప్ర‌జ‌ల్లోకి వెళ్ళేందుకు స‌మ‌ర‌శంఖారావం కార్య‌క్రమాన్ని మొద‌లుపెట్టారు. ఎన్నిక‌ల‌కు మూడునెల‌లు మాత్ర‌మే స‌మ‌యం ఉండ‌డం, నోటిఫికేషన్ టైమ్ ద‌గ్గ‌ర‌ప‌డుతుండ‌డంతో జ‌గ‌న్ చాలా జాగ్ర‌త్త‌గా అడుగులు వేస్తున్నారు.

ఇక మ‌రో సెన్షేష‌న్ మ్యాట‌ర్ ఏంటంటే.. ఎన్నిక‌ల వేళ తెర‌పైకి వ‌స్తున‌న ప‌లు జాతీయ స‌ర్వేలు వైసీపీకే ప‌ట్టం క‌డుతున్న సంగ‌తి తెలిసిందే. దీంతో ఇప్పటికే ఆ పార్టీలో వ‌ల‌స‌లు పెరిగిన సంగ‌తి తెలిసిందే. అయితే ఇప్పుడు తాజా వినిపిస్తున్న వార్త‌ల ప్ర‌కారం బీజేపీ బ్రాండ్ విశాఖ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు వైసీపీలోకి తీసుకొచ్చే ప్ర‌య‌త్నాలు జరుగుతున్నాయని ఓ వార్త ఇప్పుడు రాజ‌కీయ‌వ‌ర్గాల్లో స్ప్రెడ్ అవుతోంది.

నేటి రాజ‌కీయాల్లో క్లీన్ ఇమేజ్ సొంతం చేసుకున్న విష్ణుకుమార్ రాజు త‌న నియోజ‌క‌వ‌ర్గాన్ని అన్ని విధాల అభివృద్ది చేశారు. అయితే ప్ర‌స్తుతం రాష్ట్రంలో బీజేపీ ప‌రిస్థితి ఏమంత బాగోలేక‌పోవ‌డం ఆయ‌న‌కు మైన‌స్‌గా మారింది. దీంతో ఆయ‌న టీడీపీలోకి వెళ్ళేందుకు సిద్ధ‌మ‌వుతున్నార‌నే వార్త‌లు కొన్ని నెల‌ల క్రితం వినిపించాయి. అయితే ఇప్పుడు ఆయ‌న వైసీపీ వైపు చూస్తున్న‌ట్టు తెలుస్తోంది.

ఏపీ చివ‌రి అసెంబ్లీ స‌మావేశాలు ఒక‌సారి గ‌మ‌నిస్తే.. అధికార టీడీపీని ఒంటి చేత్తో నిలువ‌రిస్తున్నారు విష్ణుకుమార్ రాజు. టీడీపీ నేత‌లు సంధిస్తున్న ప్ర‌శ్న‌లకు వివ‌రాల‌తో స‌హా స‌మాధానాలు చెబుతూ ఎండ‌గ‌డుతున్నారు. ముఖ్యంగా ఎమ్మెల్యేల రాజీనామాలు ఆమోదించిన రోజున, వైసీపీ నుండి ఫిరాయించిన ఎమ్మెల్యేల‌ను ఎందుకు స‌స్పెండ్ చేయ‌లేద‌ని వైసీపీ గొంతును బ‌లంగా వినిపించారు.

దీంతో విశాఖ ఉత్త‌ర నియోజ‌క‌వ‌ర్గంలో వైసీపీ బ‌లంగానే ఉన్నా, విష్ణుకుమార్ రాజు లాంటి క్లీన్ ఇమేజ్ ఉన్న నేత పార్టీలో ఉంటే విశాఖ‌లో అర్బ‌న్ ఏరియాస్‌తో పాటు ప‌లు నియోజ‌క‌వ‌ర్గాల్లో వైసీపీకి బ‌లం పెరుగుతోంది. ఈ క్ర‌మంలో ఇప్పుటికే ఆయ‌న్ని పార్టీలోకి తీసుకొచ్చేందుకు జోరుగా రాయ‌బేరాలు జ‌రుగున్నాయ‌ని స‌మాచారం. ఆయ‌న ఓకే అంటే చాలు టిక్కెట్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉంది వైసీపీ. మ‌రి విష్ణుకుమార్ రాజు ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటార‌నేది ఇప్పుడు ఆశ‌క్తిగా మారింది. ఒక‌వేళ నిజంగానే విష్ణుకుమార్ రాజు వైసీపీలో చేరితే విశాఖ అర్బ‌న్‌లో వైసీపీకి తిరుగే ఉండ‌ద‌ని రాజ‌కీయ‌వ‌ర్గాల్లో చ‌ర్చించుకుంటున్నారు.