దేశానికి పట్టిన దెయ్యం మోడీ – ఎమ్మెల్సీ డొక్కా..!

Friday, November 2nd, 2018, 03:00:24 PM IST

ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ వెళ్లి చేస్తున్న హడావుడి చూస్తూనే ఉన్నాం, జగన్ పై హత్యాయత్నం నుండి ప్రజల దృష్టి మరల్చేందుకు ఆయన ఢిల్లీ వెళ్లారని కొందరు అంటుంటే, టీడీపీకి సంబందించిన వారి పై ఐటీ సోదాలు జరుగుతున్న నేపథ్యంలో వారిని కాపాడేందుకు బాబు ఢిల్లీ వెళ్లారని, పైకి మాత్రం మీడియా సమావేశాల్లో మోడీని టార్గెట్ చేస్తూ, “సేవ్ నేషన్” అంటూ డ్రామా ఆడుతున్నారని కొంతమంది అంటున్నారు. ఢిల్లీ వెళ్లి అక్కడ కాంగ్రెస్ తో సీట్ల సర్దుబాటు విషయం గురించి కూడా చర్చలు జరిగినట్లు తెలుస్తుంది. ఈ పర్యటనలో భాగంగా బాబు పలువురు జాతీయ స్థాయి రాజకీయ ప్రముఖులతో భేటీ అయ్యారు, బీజేపీయేతర పక్షాలన్నిటిని కలుపుకుపోయి బీజేపీ ని ఓడించి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటూ ఆయన పిలుపునిచ్చారు.

ఈ నేపథ్యంలో టీడీపీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవర ప్రసాద్ మీడియా తో మాటాడుతూ “మోడీ దేశానికి పట్టిన దెయ్యం, ఆ దెయ్యాన్ని వదిలించి దేశాన్ని కాపాడేందుకే చంద్రబాబు ఢిల్లీ వెళ్లారు” అన్నారు. అన్ని పక్షాలు ఏకమై బీజేపీ ఓడించాల్సిన సమయం ఆసన్నమైందని, ఆయన అన్నారు. దేశాన్ని, ప్రజాస్వామ్యాన్ని రక్షించటమే తమ లక్ష్యం అని అన్నారు. దేశభక్తి అని చెప్పుకుంటూ తిరిగే బీజేపీ రాఫెల్ కుంభకోణం తో దేశ భద్రతను అమ్మకుంది అంటూ బీజేపీ పై ఆగ్రహం వ్యక్తం చేసారు.