గిరిజ‌న రిజ‌ర్వేష‌న్లలో కేసీఆర్ మోసం?

Saturday, October 27th, 2018, 12:01:16 AM IST

టీఆర్ఎస్ తొత్తు సింగరేణి సీఎండీ శ్రీ‌ద‌ర్‌ను వెంట‌నే బ‌దిలీ చేయాల‌ని గిరిజ‌న నాయ‌కుడు, ఎమ్మెల్సీ రాములు నాయక్ డిమాండ్ చేశారు. 4 సంవత్సరాలుగా ఒకే చోట పని చేస్తున్న సింగరేణి సీఎండీ శ్రీధర్ ను వెంటనే బదిలీ చేయాలని, 50వేల మంది సింగరేణి కార్మికులను టిఆర్ఎస్ కు అనుకూలంగా వుండేలా శ్రీధర్ వ్యవహరిస్తున్నార‌ని ఆరోపించారు. గ్రూప్1 ఆఫీసర్లను టిఆర్ఎస్ నాయకులు భయబ్రాంతులకు గురి చేస్తున్నారు. గిరిజనులకు రిజర్వేషన్లు ఇవ్వకుండా కేసీఆర్ మోసం చేశాడని ఆవేద‌న చెందారు.

నేను రిజర్వేషన్ల పై ఆడిగినందుకే నన్ను పార్టీ నుండి బహిష్కరించారు. గిరిజన రిజర్వేషన్లు ఇచ్చిన పార్టీకే మా మద్దతు గిరిజన సంఘాలు ఎలా అంటే నెను అలానే నడుచుకుంటాన‌ని రాములు నాయ‌క్ అన్నారు. గిరిజనులను అవమానపరిచిన టిఆర్ఎస్ అభ్యర్థి భూపాల్ రెడ్డి పై వేటు వేయాలని సీఈవోకు వినతి పత్రం సమర్పించామ‌ని తెలిపారు. రిజర్వేషన్ల గురించి అడిగినందుకు మా గిరిజనులను అక్కడ, ఇక్కడ కేసీఆర్ నన్ను అవమానించార‌ని ఆవేద‌న చెందారు. మొత్తానికి తెలంగాణ‌లో గిరిజ‌నం కేసీఆర్ కు ఎదురు బావుటా ఎగుర వేస్తున్నార‌ని దీనిని బ‌ట్టి అర్థం చేసుకోవ‌చ్చు.

  •  
  •  
  •  
  •  

Comments