కీర‌వాణిని అందుకే ప‌క్క‌న పెట్టారు?

Monday, May 28th, 2018, 11:30:01 PM IST


ఆఫీస‌ర్ ప్రీరిలీజ్ వేడుక సాక్షిగా మ‌ర‌క‌త‌మ‌ణి ఎం.ఎం.కీర‌వాణి ఎన్నో న‌గ్న‌స‌త్యాల్ని ఆవిష్క‌రించారు. ఆయ‌న దాదాపు ముప్పై ఏళ్ల క్రితం రావుగారిల్లు సినిమా టైమ్‌లో ప‌రిశ్ర‌మ‌లో అడుగుపెట్టారు. అక్కినేని ఫ్యామిలీ సినిమా రావుగారిల్లు చిత్రానికి సుస్వ‌రాల‌ చ‌క్ర‌వ‌ర్తి సంగీతం అందించారు. అయితే అదే టైమ్‌లో కీర‌వాణి సినీఛాన్సుల కోసం ఎక్కే గ‌డ‌ప‌, దిగే గ‌డ‌ప అంటూ అటూ ఇటూ తిరిగేవార‌ట‌. ఆ క్ర‌మంలోనే అక్కినేని కాంపౌండ్‌లోనూ అడుగుపెట్టి అవ‌కాశం అడిగార‌ట‌.

ఆ టైమ్‌లోనే యువ‌సామ్రాట్ నాగార్జున ఆర్జీవీ ద‌ర్శ‌క‌త్వంలో `శివ‌` సినిమా తీశారు. ఆ సినిమాకి సంగీత ద‌ర్శ‌కుడిగా అవ‌కాశం ఇవ్వ‌మ‌ని కీర‌వాణి సంప్ర‌దిస్తే నాగార్జున అత‌డిని కొత్త కుర్రాడు అంటూ ప‌క్క‌న పెట్టేశార‌ట‌. .. ఆ విష‌యాన్ని ఆఫీస‌ర్ ప్రీరిలీజ్ ఈవెంట్‌లో గుర్తు చేసుకున్న కీర‌వాణి.. సార్ ఇప్పుడు మాత్రం కొత్త‌వాడిని కాను.. అవ‌కాశాలివ్వండి ప్లీజ్ అంటూ బ‌తిమాలారు. మొత్తానికి కొత్త కుర్రాడు అన‌గానే తొలుత అవ‌కాశం ఇచ్చేందుకు జంకుతారు. కానీ నాగార్జున‌, ఆర్జీవీ దానిని బ్రేక్ చేస్తూ ఎంద‌రికో అవ‌కాశాలిచ్చారు కెరీర్‌లో. శివ సినిమాకి ఇళ‌య‌రాజా అందించిన సంగీతం ట్రెండ్ సెట్ట‌ర్ అయ్యింది. ఒక‌వేళ కీర‌వాణికి అవ‌కాశం ఇస్తే ఏం చేసేవాడో .. ఎందుకంటే కొత్త కుర్రాడు క‌దా? ఆస‌క్తిక‌రంగా మూడు ద‌శాబ్ధాల కెరీర్ పూర్తి చేసుకున్న కీర‌వాణి ఇప్ప‌టికీ కొత్త కుర్రాడిలా నాగార్జున‌ను అవ‌కాశాలు అడుగుతూనే ఉన్నారు. ఆఫీస‌ర్‌కి నాగార్జున కీర‌వాణిని ప‌క్క‌న పెట్టేశారు. అయితే చైత‌న్య‌ స‌వ్య‌సాచికి మాత్రం ఛాన్సిచ్చారు. జువ్వ అనే వేరొక చిత్రాన్ని కీర‌వాణి చేస్తున్నారు.

  •  
  •  
  •  
  •  

Comments