వైరల్ వీడియో : ఎంఎంటీఎస్ తో సెల్ఫీ.. డ్యాష్ ఇచ్చిన ట్రైన్

Wednesday, January 24th, 2018, 03:00:39 PM IST

రైల్వే శాఖ ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా కూడా రైలు ప్రమాదాలు తగ్గడం లేదు. ఎక్కడో ఒక చోట విషాద ఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. ముఖ్యంగా సెల్ఫీల మాయలో పడి యువత రైలు ప్రమాదాలకు గురవుతున్నారు. రీసెంట్ గా హైదరాబాద్ లో కూడా అలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది. భరత్ నగర్ రైల్వే స్టేషన్ సమీపంలో శివ అనే యువకుడు ఎంఎంటీఎస్ ట్రైన్ వ‌స్తుండ‌గా సెల్ఫీ వీడియో తీసుకోవాలని అనుకున్నాడు. అయితే దగ్గరికి వచ్చే వారికు అతను గమనించకుండా పోజులు ఇవ్వడంతో రైలు అతన్ని గట్టిగా తాకుతూ వెళ్లింది. కుడి చేతికి తలకు గాయాలు అయ్యాయి. వెంటనే రైల్వే సిబ్బంది గమనించి అతన్ని ఆస్పత్రికి తరలించారు. వైద్యం అందించిన డాక్టర్లు ప్రాణాలకు ఎలాంటి అపాయం లేదని తెలిపారు.