దుర్మరణం : స్మార్ట్ ఫోన్ పేలగానే పేగులు బయటకొచ్చాయి.

Thursday, April 12th, 2018, 09:41:13 AM IST

ఈ మధ్య కాలంలో మొబైల్ ఫోన్లు చాలానే పేలుతున్నాయి. బ్రాండెడ్ మొబైల్స్ కూడా అలంటి ఘటనలకు గురవ్వడంతో మొబైల్స్ ముట్టుకోవాలంటే కొందరు భయపడుతున్నారు. ఎక్కువగా ఛార్జింగ్ పెట్టి మొబైల్స్ వాడుతున్నప్పుడే ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. అసలు వివరాల్లోకి వెళితే.. ఛత్తీస్ ఘడ్ లోని కొరియా జిల్లాలోని ఒక గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. రవి సోన్‌వాన్ అనే మైనర్ బాలుడు మొబైల్ కు ఛార్జింగ్ పెట్టి గేమ్స్ ఆడటం స్టార్ట్ చేశాడు. అతని పక్కన మరికొంత మాది స్నేహితులు కూడా ఉన్నారు. అయితే మొబైల్ ఒక్కసారిగా పేలిపోవడంతో బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. పేగులు ఒక్కసారిగా బయటకి వచ్చాయ. అలాగే సమీపంలో ఉన్న మరికొంత మంది పిల్లలు కూడా గాయపడ్డారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు వెంటనే అప్రమత్తమై హాస్పిటల్ కి తీసుకువెళ్లినప్పటికీ తీవ్రంగా గాయపడిన పిల్లడు బ్రతకలేకపోయాడు. పరిస్థితి విషయమించడంతో రవి కన్నుమూశాడు.

  •  
  •  
  •  
  •  

Comments