వీడియో: భోజనం చేస్తుంటే ఫోన్ పేలింది!

Thursday, June 7th, 2018, 03:40:16 AM IST

ఈ మధ్య కాలంలో వరుసగా ఫోన్లు పేలుతున్న ఘటనలు ఎక్కువగా చోటపు చేసుకుంటున్నాయి. తీవ్రంగా గాయపడుతున్నవారు కొందరైతే వాటి వల్ల మరణిస్తున్న వారి సంఖ్య కూడా పెరుగుతోంది. ఇటీవల ఓ రెస్టరెంట్ లో ప్రశాంతంగా కూర్చొని భోజనం చేస్తున్న ఒక వ్యక్తి దగ్గర ఫోన్ పేలిపోవడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. ప్రస్తుతం అందుకు సంబందించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ముంబైలోని బంధూప్ ప్రాంతంలో ఉన్న ఓ ప్రముఖ రెస్టారెంట్ లో ఓ వ్యక్తి భోజనం చేస్తుండగా సడన్ గా జేబులో ఉన్న ఫోన్ నుంచి పొగలు వచ్చాయి. అనంతరం ఫోన్ ఒక్కసారిగా పేలిపోయింది. ఆ ప్రదేశమంతా సెకనులో పొగలు వ్యాపించగా పక్కన ఉన్న వారు కూడా భయపడిపోయారు. గాయపడిన వ్యక్తిని హోటల్ సిబ్బంది వెంటనే హాస్పిటల్ కేజీ తరలించారు. ఘటన మొత్తం అక్కడ సిసి కెమెరాలో రికార్డ్ అయ్యింది.

  •  
  •  
  •  
  •  

Comments