ఫోన్లపై నిఘాను ఏర్పాటుచేసిన అమెరికా

Saturday, June 8th, 2013, 12:55:28 PM IST


ఫోన్ లో హలో అంటే చాలు ఆ ఫోన్ ఎవరు చేశారు, ఎవరికీ చేశారు అనే విషయం రికార్డ్ అయిపోతుంది. అవును ఇది నిజం ఏదో ఒకరిదో ఇద్దరిదో కాదు కొన్ని లక్షల మంది ఫోన్ కాల్స్ పై అమెరికా ప్రభుత్వం నిఘని ఏర్పాటుచేసింది. అమెరికాలో అతిపెద్ద సర్వీస్ ప్రొవైడర్లలో ఒకటైన మేరిజోన్ పై అమెరికా విదేశీ నిఘా పర్యవేక్షణ కోర్టు(ఫిసా) ఇచ్చిన ఆదేశాల ప్రకారమే ఈ నిఘాని ఏర్పాటు చేశామని అమెరికా అధికారులు చేబుతున్నారు. కొన్ని సీక్రెట్ ఆదేశాలు అందటం వల్లనే కోర్టు ఈ నిర్ణయం తీసుకుందని ‘ద గార్డియన్’ తెలియజేసింది. దీనిపై ప్రజల్లో బిన్న అబిప్రాయాలు వేలుబడుతున్నాయి. అమెరికా పౌర సంఘాలు ఈ విషయంపై మండిపడుతున్నాయి.

కానీ అమెరికా ప్రభుత్వం మాత్రం ఈ విషయాన్ని సమర్దించుకుంటోంది. ఈ నిఘాలో కేవలం ఎవరు ఫోన్ చేశారు, ఎక్కడికి చేశారు, ఎవరికి చేశారు అనే విషయాలను మాత్రమే రికార్డ్ చేస్తున్నామని వారు మాట్లాడిన సంభాషణలను రికార్డు చేయడంలేదని తెలిపింది. ఉగ్రవాదుల నుండి దేశాన్ని కాపాడుకోవడానికి ఇలాంటి చర్యలు తప్పవని అధికారులు చెబుతున్నారు. బోస్టన్ మారథాన్ సమయంలో పెల్లుళ్ళు జరిగిన తరువాతనే కోర్టు ఈ ఆదేశాలను ఇచ్చిందని అధికారులు తెలియజేశారు.