చివరికి అద్వాణీనే దిక్కు.. మోడీ – షా న్యూ ప్లాన్?

Wednesday, June 6th, 2018, 03:46:09 AM IST

2014 ఎన్నికల్లో సంచలనం సృష్టించిన భారత జనతా పార్టీ అనుకున్నట్టుగానే అధికారాన్ని అందుకొని మంచి నేమ్ తో పాలనను కొనసాగించింది. కానీ ఎన్నికలపై పెట్టిన ఏకాగ్రత బీజేపీ పాలనపై ఎక్కువగా పెట్టలేదు. జరుగుతున్న పరిణామాలు నెక్స్ట్ ఎలక్షన్స్ లో ఓటమి తప్పేలా లేదు. ఎంత కష్టపడినా కూడా నెక్స్ట్ ఎలక్షన్ లో ప్రాంతీయ పార్టీల మద్దతు లభిస్తుందో లేదో తెలియని సందేహం చాలానే ఉంది. ఇప్పటికే చాలా పార్టీలు ఎన్డీయే కూటమి నుంచి తప్పుకున్నాయి.

ఈ పరిస్థితుల్లో సీనియర్ నాయకులైన లాల్‌ కృష్ణ అద్వాణీ(90)ని మోడీ రంగంలోకి దింపేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. భారతీయ జనతా పార్టీ(బీజేపీ) కురువృద్ధుడైన అద్వాణీ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి ఎంతగానో కష్టపడ్డారు. అయితే ఈ సారి అవసరం అయితే అద్వానీని ఎన్నికల బరిలోకి దింపేందుకు కూడా అమిత్ షా గ్యాంగ్ వ్యూహ రచన చేస్తున్నట్లు తెలుస్తోంది. మహారాష్ట్రలో శివసేన, బీహార్‌ జనతా దళ్‌ యునైటెడ్‌(జేడీయూ) – తెలుగుదేశం పార్టీ ఎన్డీయేపై అసంతృప్తితో ఉండటాన్ని చాలా వరకు అద్వానీతో చర్చించినట్లు సమాచారం.

  •  
  •  
  •  
  •  

Comments