మోడీ, అమిత్ షా కలిసి జగన్ ని కాపాడుతున్నారు…..!

Monday, September 3rd, 2018, 10:20:44 PM IST

కేంద్రంలో నరేంద్ర మోడీ మరియు అమిత్ షా ఏపీలో టిడిపిని తొక్కిపెట్టేందుకు కుట్రపన్నుతున్నారని, ఒకవిధంగా జగన్ ను రక్షించేందుకు వారు అన్నివిధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారని, టిడిపి నేత వర్ల రామయ్య విమర్శించారు. ఎప్పుడో ఏడేళ్ల క్రితం జగన్ పై మొదటి ఛార్జి షీటు దాఖలైతే ఇప్పటివరకు అయన కేసు కొనసాగుతూనే వుంది అంటే దానికి అర్ధం ఏమిటని అయన ప్రశ్నించారు. ఇప్పటికే రాష్ట్ర ప్రజలను వంచించిన బీజేపీ నేతలు ఈ విధంగా ప్రతిపక్ష నేతతో రహస్య రాజకీయాలు చేస్తూ ప్రజలను మోసగించడం ఎంతవరకు సబబని అయన అన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో స్పందించని మోడీ, ఇకపై రాష్ట్రానికి ఏదో చేస్తారని ప్రజలు ఇకపై వారిని నమ్మే పరిస్థితి లేదని అన్నారు.

రాబోయే ఎన్నికల్లో లబ్ధిపొందేందుకే బీజేపీ ఈ విధంగా కుట్రలు పన్నుతోందని ఆయన విమర్శించారు. ఏపీ ప్రజలు వైసిపి మరియు బీజేపీలను నమ్మే పరిస్థితి లేదని, వైసిపికి అధికారం ఇస్తే జగన్ రాష్ట్రాన్ని బ్రష్టుపట్టిస్తారనే విషయం ప్రజలకు తెలుసునని, అందుకే గత ఎన్నికల మాదిరిగా రాబోయే ఎన్నికల్లో కూడా వారికీ అధికారం దక్కడం ఒక కలగానే మిగులుతుందితప్ప తీరే అవకాశం లేదని రామయ్య అన్నారు. ఇక రాష్ట్రంలో చంద్రబాబు ప్రవేశపెట్టిన సంక్షేమ పధకాలు మరియు కేంద్రం వారు మనకు సాయం చేయనప్పటికీ కూడా ఆయన పడుతున్న కష్టాన్ని ప్రజలు గుర్తుంచుకుని తప్పకుండ రాబోయే ఎన్నికల్లో మాకు విజయాన్ని అందిస్తారనే నమ్మకం తమకు ఉందని ఆయన అన్నారు….

  •  
  •  
  •  
  •  

Comments