టాప్ స్టోరి : మోదీ, షా ఎత్తుగ‌డ ఫ‌లిస్తుందా?

Saturday, October 13th, 2018, 10:00:19 PM IST

ద‌క్షిణాదిలో పాగా వేయాల‌ని బీజేపీ పార్టీ శ్రేణులు గ‌త కొన్ని నెల‌లుగా ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. అందుకు త‌మ‌కు అనుకూల శ‌క్త‌లను కూడ‌గ‌డుతున్న బీజేపీ ప్ర‌తికూలంగా వున్న శుక్తుల‌పై ఎదురుదాడికి దిగుతూ న‌యానా భ‌యానా లొంగ‌దీసుకునే ప్ర‌య‌త్నం చేస్తోంది. గ‌త ఎన్నిక‌ల్లో బీజేపీతో దోస్తీక‌ట్టిన చంద్ర‌బాబు ఆ త‌ద‌నంత‌ర ప‌రిణామాల త‌రువాత ఎన్‌డీఏ నుంచి బ‌య‌టికి వ‌చ్చి ఆ పార్టీ శ్రేణుల‌పై ప్ర‌ధాని న‌రేంద్ర మోడీపై బాహాటంగానే విమ‌ర్శ‌లు చేస్తున్నాడు. ఈ ఎదురుదాడిని గ‌మ‌నించిన న‌రేంద్ర‌మోడీ, బీజేపీ ఛీఫ్ అమిత్ షా ఏపీలో టీడీపీ శ్రేణుల్ని…దేశ‌వ్య‌ప్తంగా చంద్ర‌బాబును అన్ పాపుల‌ర్ చేయాల‌ని కొత్త ఎత్తుల‌కు శ్రీ‌కారం చుట్టారు.

ఇందులో భాగంగానే టీడీపీ శ్రేణుల‌ను టార్గెట్ చేస్తూ ఐటీ దాడులు చేయిస్తున్నారు. అయితే ఈ దాడులు ఇంకా జ‌రుగుతాయ‌ని, దీంతో టీడీపీ శ్రేణుల్లో వ‌ణుకు పుట్టించి దాసోహం అనిపించాల‌నేదే మోడీ, షా ఎత్తుగ‌డ‌గా పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. టీడీపీ శ్రేణుల ఆర్థిక బ‌లంపై దెబ్బ‌కొట్టాల‌న్న ఎత్తుగ‌డ‌లో భాగంగానే ఐటీ దాడుల‌కు పూనుకున్న కేంద్రం ఒక్కొక్క టీడీపీ పిల్ల‌ర్‌ను బ‌ద్ద‌లు కొట్ట‌డం మొద‌లుపెట్టింది. దీనికి తోడు ఓటుకు నోటు బీజేపీ శ్రేణుల‌కు బ్ర‌హ్మ‌స్త్రంగా ప‌రిణ‌మిస్తోంది. దీన్ని ఆయుధంగా చేసుకుని టీడీపీ చోటా మోటా నాయ‌కుల‌తో పాటు టీడీపీ అధినేత చంద్ర‌బాబును క‌ట్ట‌డి చేయాల‌ని ప్లాన్ చేస్తోంది.

తాజా ప‌రిణామాలని బ‌ట్టి తెలంగాణ సీఎంను త‌మ‌కు అనుకూలంగా మార్చ‌కున్న బీజేపీ ఏపీ సీఎంను ఇరుకున పెట్టేందుకు దూకుడు పెంచింది. ఇప్ప‌టికే త‌మ అధికార ప్ర‌తినిధి జీవీఎస్ న‌ర‌సింహారావుతో దూకుడు పెంచిన బీజేపీ ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వ అక్ర‌మ బ్యాంకు ఖాతాల గుట్టు విప్పే ప‌నిలోప‌డింది. దీంతో త‌మ‌పై ఒంటికాలిపై చేస్తున్న చంద్ర‌బాబును దేశ‌వ్యాప్తంగా దెబ్బ‌తీయాల‌ని, త‌న పాపులారిటీని దెబ్బ‌కొట్టాల‌ని న‌రేంద్ర‌మోడీ, షా వేస్తున్న ఎత్తులు ఏ ట‌ర్న్ తీసుకుంటాయో? ఏపీ రాజ‌కీయాల్లో ఏ స్థాయి సంచ‌ల‌నాల‌కు తెర‌తీస్తాయో చూడాలి.