శ‌భాష్ పీఎం.. సొంత పార్టీనే హ‌డ‌లెత్తిస్తూ..!!

Tuesday, November 29th, 2016, 10:00:29 PM IST

modi1
ప్ర‌ధాని న‌రేంద్ర మోదీని శ‌భాష్ అనకుండా ఉండ‌లేం. నిన్న‌టివ‌ర‌కూ వందిమాగ‌దులు (విప‌క్షాలు, ప్ర‌తిప‌క్షాలు) అంతా ఎక‌మై న‌రేంద్ర మోదీ పెద్ద నోట్ల ర‌ద్దు నిర్ణ‌యాన్ని తీవ్రంగా వ్య‌తిరేకించారు. దేశంలో అదో పెద్ద స్కామ్ అంటూ అభివ‌ర్ణించే ప్ర‌య‌త్నం చేశారు. పెద్ద నోట్ల ర‌ద్దుపై ముందే భాజ‌పా నేత‌ల‌కు, మిత్ర‌ప‌క్షాల నేత‌ల‌కు చెప్పిన త‌ర్వాతే ఈ నిర్ణ‌యం ప్ర‌క‌టించార‌ని పార్టీల‌న్నీ దుమ్మెత్తిపోశాయి. దాంతో మోదీ అవ‌త‌లివాళ్ల‌కు స‌మాధానం చెప్ప‌లేక ఇబ్బంది ప‌డాల్సొచ్చింది.

అయితే ఇక అంద‌రి నోళ్ల‌కు తాళం వేసేందుకు మోదీ తీసుకున్న నిర్ణ‌యం దేశ‌వ్యాప్తంగా ప్ర‌జ‌ల్ని, పార్టీల్ని నిశ్చేష్టుల్ని చేస్తోంది. అస‌లు సొంత పార్టీ, పొరుగు పార్టీ అనే తేడా త‌న‌కి లేదని ఆయ‌న చ‌ర్య‌లు చెప్ప‌క‌నే చెబుతున్నాయి. న‌ల్ల ధ‌నం విష‌యంలో స్వ‌పార్టీనేత‌లు అన్న ముసుగులో గుద్దులాట త‌న‌కి లేద‌ని మోదీ తాజా చ‌ర్య‌లు రివీల్ చేస్తున్నాయి. న‌వంబ‌ర్ 8 ర‌ద్దు ప్ర‌క‌ట‌న నుంచి ఇప్ప‌టివ‌ర‌కూ ఎలాంటి లావాదేవీలు జ‌రిపినా అవ‌న్నీ నాకు తెలియాలి అంటూ సొంత పార్టీ నేత‌ల‌నే ఆదేశించారు మోదీ. దీంతో భాజ‌పా నేత‌లంతా ఒక్క‌సారి గా కంగు తినాల్సొచ్చింది. మొత్తానికి ప్ర‌తిప‌క్షం, స్వ‌ప‌క్షం అన్న తేడా త‌న‌కి లేద‌ని మోదీ ప్రూవ్ చేశారు. మ‌రి అదే త‌ర‌హాలో కాంగ్రెస్‌వాళ్లు, తృణ‌మూల్ నేత‌లు, ఆమ్ ఆద్మీ వాళ్లు త‌మ ఖాతాల లావాదేవీల్ని బ‌హిర్గ‌తం చేయ‌గ‌ల‌రా? ఆ ధైర్యం వాళ్ల‌కు ఉందా?