తలుపులు వేసి మరి రాష్ట్రాన్ని విభజించారు: మోడీ

Wednesday, February 7th, 2018, 01:56:36 PM IST

రీసెంట్ గా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ తీరు వల్ల ఆంధ్రప్రదేశ్ నాయకులు ఒక్కసారిగా తిరగబడిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా తెలుగు దేశం పార్టీ నాయకులు బీజేపీ తో స్నేహన్నీ మరచి పోరాటానికి దిగారు. ప్రస్తుతం జరుగుతోన్న పార్లమెంట్ సమావేశంలో ఎవరు ఊహించని విధంగా వారి నిరసనలను తెలుపుతున్నారు. అయితే ఈ రోజు మోడీ తెలుగు రాష్ట్రాల గురించి స్పందించారు. కాంగ్రెస్ వల్లే ఈ నాడు ఆంధ్రప్రదేశ్ దారుణంగా మారిందని మాట్లాడారు. మోడీ ప్రసంగిస్తూ.. వాజ్ పేయి అధికారంలో ఉన్నప్పుడు మూడు రాష్ట్రాలుగా విభజించినప్పటికీ ఎలాంటి సమస్య రాలేదు. తెలంగాణ పోరాటానికి మేము మద్దతు పలికాం.

కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ లబ్ది కోసం ఏపీకి అన్యాయం చేసింది. కాంగ్రెస్ చేసిన విభజనల వల్ల తెలుగు ప్రజల అన్యాయం జరిగింది. నెహ్రు పాలనా బ పార్టీ లో కనుమరుగైపోయింది. రాజీవ్ గాంధీతో హైదరాబాద్ లో దళిత ముఖ్యమంత్రిని దారుణంగా అవమానించారు. వారి బాగోతాలు ఎవ్వరికి తెలియనివి కావు. రెండు రాష్ట్రాల విభజన సమయంలో పార్లిమెంట్ తలుపులు మూసి బిల్లును ఆమోదింపజేసుకుందని మోడీ తెలియజేశారు. ప్రతి పక్షాల మాటను కూడా పట్టించుకోలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇక మోడి తెలుగు దేశం పార్టీ వ్యవస్థాపకుడైన ఎన్టీఆర్ గురించి కూడా మాట్లాడారు. ప్రజలకు మంచి చేయాలనే ఆలోచనతోనే ఆయన రాజకీయాల్లోకి వచ్చారని వివరించారు.