సామ్రాజ్యాలు కూలదోస్తున్నా..ఓపిక పట్టండి అంటున్న మోడీ..!

Sunday, November 13th, 2016, 11:45:38 PM IST

modiji
తాను నల్ల కుబేరుల సామ్రాజ్యాలను కూలదోస్తున్నానని ప్రజలు 50 రోజులు ఓపిక పట్టాలని నరేంద్ర మోడీ ప్రజలకు విన్నపం చేశారు. ఎన్నికల ప్రచారం లో తాను ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటున్నానని మోడీ అన్నారు.పెద్దనోట్ల రద్దు నిర్ణయం ప్రకటించిన తరువాత నరేంద్రమోడీ తొలిసారి దానిపై విపులంగా మాట్లాడారు. గోవాలో రెండు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసిన తరువాత నరేంద్రమోడీ జాతిని ఉద్దేశించి ప్రసంగించారు.

పెద్ద నోట్ల రద్దుపై 50 శాతం ఎంపీలు వ్యతిరేకత తెలిపారని అయినా తాను రద్దు చేయడానికే నిర్ణయించుకున్నానని మోడీ వివరించారు. తాను అవినీతి పై సామాన్యుల తరపున చేస్తున్న యుద్ధంగా మోడీ దీనిని అభివర్ణించారు.దేశ ఆర్థిక వ్యవస్థని బాగు చేయడానికి తాను చిన్న చిన్న మందులు ఇస్తున్నానని మోడీ అన్నారు.దేశం లో మిగిలి పోయిన నల్ల ధనం విలువని గుర్తించేందుకు నిపుణుల సాయం తీసుకుంటానని మోడీ అన్నారు.