కర్ణాటక కొత్త సీఎంకు ఫోన్ చేసిన మోడీ

Thursday, May 24th, 2018, 12:44:39 AM IST

కర్ణాటకలో కొత్త ప్రభుత్వం ఏర్పడినందుకు దేశవ్యాప్తంగా నేతలు ఆ రాష్ట్ర ప్రభుత్వానికి
శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యంగా జేడీఎస్ అధినేత రెండవసారి సీఎం సీటును పొందినందుకు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు అభినందించారు. ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలు జేడీఎస్ నేత కుమారస్వామిని ప్రత్యేకంగా కలుసుకొని శుభాకాంక్షలు తెలిపారు. ఎక్కువగా బీజేపీ వ్యతిరేక పార్టీలు జేడీఎస్ కు మద్దతు పలికాయి. ఇకపోతే దేశ ప్రధానిగా నరేంద్ర మోడీ కూడా కుమారస్వామికి అభినందనలు తెలియజేశారు.

కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కుమారస్వామికి ప్రత్యేకంగా ఫోన్ చేసి మరి ప్రధాని అభినందనలు తెలియజేశారు. అదే విధంగా కర్ణాటక రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం నుంచి అన్ని విధాలుగా సహకారం మద్దతు ఉంటుందని మోడీ తెలిపారు. అలాగే డిప్యూటీ సీఎం గా ప్రమాణ స్వీకారం చేసిన కాంగ్రెస్ నేత పరమేశ్వరకు కూడా మోడీ ఫోన్ చేసి అభినందించారు. ఇక మరో ప్రముఖ నేత హోమ్ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కొత్త సీఎం – డిప్యూటీ సీఎంలకు శుభాకాంక్షలు తెలుపుతూ.. శాంతి అభివృద్ధి అలాగే సంక్షేమం వంటి అన్ని విషయాల్లో కర్ణాటక పురోగతి సాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు రాజ్ నాథ్ ట్వీట్ చేశారు.

  •  
  •  
  •  
  •  

Comments