రూ.2000 నోటుతో మోడీ అతి పెద్ద పొరపాటు చేస్తున్నారా..?

Sunday, November 13th, 2016, 12:52:53 PM IST

modi-with-200
రద్దయిన రూ 500,రూ .1000 నోట్లను మార్చుకోవాలంటే బ్యాంకుల వద్ద గంటల సేపు పడిగాపులు తప్పవు.డిపాజిట్ చేసిన మొత్తాన్ని ఏటీఎం ల ద్వారా డ్రా చేసుకోవాలన్నా అంతే పరిస్థి.కొన్ని ఏటీఎం లు పనిచేయడమే మానేశాయి. కస్టపడి డ్రాచేసినా వచ్చేది రెండువేల నోటు.దానితో నిత్యావసర సరుకులు కొందామంటే దుకాణాల వద్ద చిల్లర కొరత. ఇది ప్రస్తుతం దేశంలో సామాన్యుడి పరిస్థితి.అవినీతి నిర్మూలనకే నోట్ల రద్దు అంటూ నరేద్ర మోడీ 500, 1000 నోట్లని రద్దు చేసి రూ 2000 నోటుని ప్రవేశ పెట్టడం ఏంటని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, దిల్ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ల దగ్గరి నుంచి సామాన్య ప్రజలవరకు మోడీ పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

సామాన్యుడు ఒకటి రెడురోజులు అయితే ఓపిక పట్టగలడు కానీ.. ఇలా రోజులతరబడి ఇలాంటి పరిస్థితే కొనసాగుతుంటే సామాన్యులు భరించడం కష్టం. ప్రస్తుతం దీనివల్లనే మోడీ పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒక సంచలనాత్మక నిర్ణయం తీసుకునేముందు సామాన్యుడి కష్టాన్ని వీలైనంత వరకు తగ్గించేలా ముందే చర్యలు తీసుకుని ఉండాలని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు.ఉత్తర ప్రదేశ్ ఎన్నికల వ్యూహం లోనే భాగంగా మోడీ ఈ పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తీసుకున్నాడని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.అయితే అది తిరిగి తిరిగి మోడీమెడకే చుట్టుకునేలా కనిపిస్తోంది.సామాన్యుడి అవసరాన్ని అలుసుగా చేసుకుని కొందరు నకిలీ రాయుళ్లు ఫేక్ రూ. 100, రూ 50 నోట్లని సృష్టించి మార్కెట్ లోని వదులుతున్నారు. చిల్లర లేమితో భాదపడుతున్న జనం ఫేక్ నోట్లని తెలియక వాటిని తీసుకుంటున్నారు.

పెద్ద నోట్లని రద్దు చేయడం సంచలన నిర్ణయమే కాదు..మంచి నిర్ణయం కూడా . కానీ సమస్య వస్తోంది రూ 2000 నోటు వద్దే. సామాన్యుడికి ఇది చిల్లర ఇబ్బందులను తెస్తోంది.ముందు ముందు ఈ సమస్య సమసి పొతే మంచిదే కానీ.. ఇలాగే కొనసాగితే మోడీ పై వ్యతిరేకత పెరగడం ఖాయం.అవినీతిని నిర్మూలించడానికే రూ 2000 నోటుని ప్రవేశ పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి.రెండువేల నోటు తయారీలో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించారని దీనివలన రెండువేల నోట్లు ఎవరి వద్ద అధిక మొత్తం లో ఉన్నాయో తెలుసుకునే వీలుంటుందని మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే దీనిని కొందరు కొట్టి పారేస్తున్నారు. కరెన్సీ నోట్లలో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించాలంటే వాటి తయారీకి చాలా సమయం పడుతుంది. అందువలన ప్రస్తుతం ఉన్న రెండువేల నోటులో ఎలాంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించలేదని రిజర్వ్ బ్యాంక్ వర్గాలు చెబుతున్నాయి.ఒక దేశం మీద యుద్ధం ప్రకటించడం కంటే కూడా అతిపెద్ద నిర్ణయాన్ని మోడీ తీసుకున్నారని.. ఇది ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో వేచి చూడాలి. ఇది మోడీ ఇమేజ్ కు ప్లస్సా .. మైనస్సా అంటే ప్రస్తుతానికి సమాధానం చెప్పడం కష్టం.