అందుకు సరైనోడు చంద్రబాబే అని మోదీ నమ్మాడు !

Tuesday, November 29th, 2016, 05:53:27 PM IST

babu-modi
ఆంధ్రప్రదేశ్ కు, కేంద్ర బీజేపీకి ఉన్న సంబంధం మామూలుది కాదు. ప్రధాని పదవి చేపట్టాక మోదీ ఎక్కువగా సాన్నిహిత్యం నడిపిన రాష్ట్రాల్లో ఏపీ కూడా ఒకటి. అయినా పెద్దగా లబ్ది చేకూరకపోవడం అనేది వేరే విషయం. ప్రస్తుత విషయానికొస్తే మోదీ ముఖ్యమంత్రిచంద్రబాబు నాయుడిపై పెద్ద భయాన్నీ మోపాడు. అదేమంటే కరెన్సీ రద్దు తరువాత ఇబ్బందుల్ని ఒక మోస్తారుగా అంచనా వేసినప్పటికీ అవి మరీ తీవ్ర స్థాయిలో ఉన్నాయి. ప్లాన్ బాగానే ఉన్నా అమలుపరచడంలో వైఫల్యం ఉందని, భవిష్యత్తులో జరిగే మంచి ఆశాజనకంగానే ఉన్నా ప్రస్తుత ఇబ్బందుల్ని తీర్చండి అంటూ జనాలు వేడుకుంటున్నారు.

దీంతో ఆలోచనలో పడ్డ మోదీ ఈ కరెన్సీ కొరత వలన మొదటికే మోసమొస్తుందని తలచి వెంటనే ఈ కొరతను తగ్గించేందుకు తీసుకోవాల్సిన చర్యలను అధ్యయనం చేసి సరైన ప్రణాళికను రూపొందించాలన్న ఉద్దేశ్యంతో దేశంలోని ఐదు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఒక కమిటీని ఏర్పాటు చేసి ఆ కమిటీ విధి విధానాలను పర్యవేక్షించేందుకు చంద్రబాబు నాయుడిని కమిటీ చైర్మన్ గా నియమించారు. దీంతో టీడీపీ శ్రేణుల్లో ఇక చంద్రబాబు జాతీయ రాజకీయాల్లో మరోసారి చక్రం తిప్పే రోజు ఆసన్నమైందని సంబరపడుతున్నారు. అలాగే ఒక ముఖ్యమైన కార్యదీక్షకు, దేశ ప్రజల ఇబ్బందుల్ని తీర్చే కర్తవ్యానికి ప్రణాళిక రచించే భాద్యత ఎలాంటి చర్చలు లేకుండా నేరుగా తెలుగు ముఖ్యమంత్రిని వెతుక్కుంటూ రావడం విశేషమే మరి.